HomeMovie News Teluguవినాయక్‌ మెగా కోరిక

వినాయక్‌ మెగా కోరిక

మెగాస్టార్‌ రీ ఎంట్రీలో చేసే సినిమా కోసం ఎంతో మంది డైరెక్టర్లను పరిశీలిస్తున్న తరుణంలో, వినాయక్‌ ఆ ఛాన్స్‌ని సైలెంట్‌గా కొట్టేశాడు. అలాగే మెగాస్టార్‌తో మరో సినిమా కూడా చేసే అవకాశం ఉంది వినాయక్‌కి. ఆల్రెడీ ఈ సినిమా విసయంలో చర్చలు కొనసాగుతున్నాయి. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి బయోపిక్‌ని వినాయక్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్‌ తెరకెక్కించే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక డైరెక్టర్‌గానే కాకుండా మెగా ఫ్యామిలీకి వీరాభిమాని వినాయక్‌.

అందుకే తన మనసులోని కోరికని బయట పెట్టాడు వినాయక్‌. మెగా ఫ్యామిలీ హీరోలందరితోనూ ఓ సినిమా చేయాలన్నది వినాయక్‌ కోరికట. అయితే ఆ కోరిక తీరే తరుణం ఎంతో దూరంలో లేదు అంటున్నాడు వినాయక్‌. అందుకోసం స్టోరీ తయారు చేయాలంటే పెద్దగానే కసరత్తులు చేయాలి అంటున్నాడు. కొంచెం కష్టమే కానీ, అసాధ్యం అయితే కాదు. తన వైపు నుండి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటానంటున్నాడు.

అలాగే ఇంకెవరైనా ఆ తరహా స్టోరీలతో ముందుకు వస్తే ఇంకా మంచిదని ఆయన సూచిస్తున్నారు. మెగాస్టార్‌తో ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాని విజయవంతంగా తెరకెక్కించడమే కాకుండా రికార్డు స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. ఆ ఆనందంతోనే వినాయక్‌ మెగా ఫ్యామిలీ కోసం మరిన్ని సినిమాలు చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానంటున్నారు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular