HomeMovie News Teluguజ‌న‌సేన‌లోకి నాగ‌బాబు

జ‌న‌సేన‌లోకి నాగ‌బాబు

2019 ఎన్నిక‌ల్లో నిల‌బ‌డ‌తాన‌ని ఎప్పుడో ప్ర‌క‌టించేశాడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ప‌వ‌న్ రాజ‌కీయ అరంగేట్రం విష‌యంలో మెగా హీరోలంతా కామ్‌గానే ఉన్నారు. ఎవ్వ‌రూ అనుకూలంగా గానీ, వ్య‌తికేరంగా గానీ మాట్లాడ‌లేదు. చిరంజీవి కాంగ్రెస్‌లో ఉండ‌డం వ‌ల్ల ఏం మాట్లాడితే ఏం వ‌స్తుందో అనేది అంద‌రి భ‌యం. అందుకే మెగా హీరోలు అంత‌మంది ఉన్నా, ప‌వ‌న్ ఒంట‌రిగా మిగిలిపోయాడు. అయితే తొలిసారి మెగా కాంపౌండ్ నుంచి ప‌వ‌న్‌కి గ‌ట్టి మ‌ద్ద‌తు ల‌భించింది. అదీ.. నాగ‌బాబు ద్వారా.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌కి స‌పోర్ట్ చేస్తాన‌ని, త‌న ఓటు తమ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కే అని, అందుకే హైద‌రాబాద్‌లో ఉన్న త‌న ఓటుని త్వ‌ర‌లోనే ఏపీకి మార్చుకొంటాన‌ని స్ప‌ష్టం చేశారు నాగ‌బాబు. ప‌వ‌న్ సీఎం అయిపోదామ‌ని రాజ‌కీయాల్లోకి రాలేద‌ని, అధికారంలో ఉన్నా, ప్ర‌తి ప‌క్షంలో ఉన్నా, ఓ సామాన్యుడిలానే ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తాడ‌ని, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ప‌వ‌న్ కంటే నిజాయ‌తీ ఉన్న నాయ‌కుడ్ని చూడ‌లేమ‌ని ప‌వ‌న్‌ని ఆకాశానికి ఎత్తేశాడు నాగ‌బాబు.

ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల స‌మ‌యం ఉంది. ఈలోగా చిరంజీవి కూడా ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి మ‌ద్ద‌తు ప‌లికే అవ‌కాశం ఉంద‌ని, మెగా ఫ్యామిలీ అంతా ప‌వ‌న్ కి స‌పోర్ట్ చేస్తార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌కి నాగ‌బాబు స‌పోర్ట్ దొర‌క‌డం ఆస‌క్తిగా మారింది. మున్ముందు ఇంకెన్ని ప‌రిణామాలు చోటు చేసుకొంటాయో…??

You May Like This
- Advertisment -spot_img

Most Popular