HomeMovie News Teluguబుల్లితెర బ్యూటీ పెళ్ళంట?

బుల్లితెర బ్యూటీ పెళ్ళంట?

బుల్లితెర యాంకర్‌ లాస్య ఈ మధ్యనే ఓ సినిమాలో హీరోయిన్‌ అయ్యిందని విన్నాం. ‘రాజా మీరు కేక’ అనే సినిమాలో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. వెండితెరపై వెలిగిపోవాలనుకుంటున్న లాస్య, అనూహ్యంగా పెళ్ళి కబురు చెప్పింది. సోషల్‌ మీడియా వేదికగా చేసుకుని, తన ఎంగేజ్‌మెంట్‌ విషయాన్ని ప్రకటించింది. దాంతో షాక్‌ తిన్నారంతా. ఓ సినిమా నిర్మాణంలో ఉండగా, హీరోయిన్లు ఎంగేజ్‌మెంట్‌ విషయాల్ని చెప్పడం చాలా అరుదు. ఎందుకంటే అది ఆ సినిమాపై ప్రభావం చూపుతుంది.

కానీ లాస్య ఎంగేజ్‌మెంట్‌కి రెడీ అవుతున్నాననీ, ఎంతో ఎగ్జైట్‌మెంట్‌గా ఉందని సోషల్‌ మీడియా ద్వారా తెలిపింది. అయితే వరుడెవరో చెప్పలేదు. దీన్ని సినిమా పబ్లిసిటీ కోసం లాస్య ఉపయోగిస్తుందా? మూమూలుగానే సెలబ్రిటీస్‌ ప్రేమ, పెళ్లి వార్తలంటే ఆడియన్స్‌కి క్యూరియాసిటీ ఉంటుంది. తద్వారా ఆడియన్స్‌ దృష్టిని ఆకర్షించే అవకాశం కూడా ఆ సెలబ్రిటీస్‌కి ఉంటుంది.

అలాగే లాస్య ఏమైనా గేమ్‌ ప్లాన్‌ చేసిందా? నిజంగానే లాస్యకు ఎంగేజ్‌మెంట్‌ అవుతుందా? లేక ఇదంతా పబ్లిసిటీ స్టంటేనా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకడంలేదు. ఓ యువ హీరోతో లాస్య పెళ్ళయిపోయిందనే గాసిప్స్‌ గతంలో వినవచ్చాయి. వాటిని ఆ హీరో ఖండించాడు. మరి ఈసారి లాస్య ఎంగేజ్‌మెంట్‌ వార్తలో నిజమెంతో చూడాలిక. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular