HomeMovie News Teluguరాంచరణ్‌ స్వీట్‌ రిస్క్‌

రాంచరణ్‌ స్వీట్‌ రిస్క్‌

2016 ఎండింగ్‌లో ‘ధృవ’ సినిమాతో వచ్చి ఆ ఏడాదికి బీభత్సమైన హిట్‌నిచ్చాడు చరణ్‌. ఈ ఏడాది సుకుమార్‌ సినిమాతో రాబోతున్నాడు. సుకుమార్‌ సినిమా కోసం చరణ్‌ ఓ పెద్ద రిస్కే చేయబోతున్నాడంటున్నారు. ఈ సినిమాలో చరణ్‌ది చెవిటి కుర్రాడి పాత్ర అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ధృవ’ సినిమాతోనే చరణ్‌ ప్రయోగాలు మొదలెట్టేశాడు. తొలి ప్రయోగం తెచ్చిన సక్సెస్‌ ఉత్సాహంతో చరణ్‌ మళ్లీ ప్రయోగానికే సై అంటున్నాడని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా కోసం చరణ్‌ తన స్టార ఇమేజ్‌ని కూడా పక్కన పెట్టేస్తున్నాడట.

తన ఇమేజ్‌కి చాలా దూరంగా ఈ సినిమాలో క్యారెక్టర్‌ ఉండబోతోందని ఫిల్మ్‌ నగర్‌ టాక్‌. ‘ధృవ’ సినిమాతోనే చరణ్‌ తన కెరీర్‌ని రిస్క్‌లో పెట్టాడంటూ చెవులు కొరుక్కున్నారు చాలా మంది. కానీ ఆ రిస్క్‌ తెచ్చిపెట్టిన సక్సెస్‌ చూస్తే మాటల్లో చెప్పలేనిది. ప్రస్తుతం ప్రయోగాత్మక సినిమాలకు ఎక్కువ క్రేజ్‌ ఉంది. అలాగే ప్రేక్షకుల ఆలోచనా ధోరణి కూడా బాగా మారింది. ‘ధృవ’ సినిమాతో ఆ విషయం పక్కాగా ప్రూవ్‌ అయ్యింది. ఓ స్టార్‌ హీరో అయిన చరణే ముందుగా ప్రయోగాల బాటలో నడవడం అభినందించదగ్గ విషయమే.

అలాగే తాజాగా చరణ్‌ – సుకుమార్‌ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో చరణ్‌ది హీరోయిజం తక్కువ ఉన్న పాత్ర అంటున్నారు. అయితే సుకుమార్‌ నుండి వచ్చే వెర్షన్‌ వేరేగా ఉంది. చరణ్‌ పాత్ర అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గదు. ప్రయోగాత్మక సినిమానే అయినప్పటికీ, చరణ్‌ నుండి అభిమానులు ఆశించే అన్ని రకాల ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో ఉంటాయి. ఫ్యాన్స్‌ ఏమాత్రం డిజప్పాయింట్‌ కావాల్సిన పరిస్థితి ఉండదు అని భరోసా ఇస్తున్నారు. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular