HomeMovie News Teluguఎన్టీఆర్‌ రిస్క్‌ చేస్తున్నాడా?

ఎన్టీఆర్‌ రిస్క్‌ చేస్తున్నాడా?

స్వర్గీయ ఎన్టీఆర్‌ నటుడిగా చేయని పాత్ర లేదు. ఆఖరికి ఆయన నెగిటివ్‌ రోల్‌లో కూడా నటించి మెప్పించాడు. అంతేకాదు ఏకకాలంలో ఒకే సినిమాలో హీరో, విలన్‌గా నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కృష్ణుడిగానూ, దుర్యోధనుడిగానూ నటించాడు ‘దాన వీర శూర కర్ణ’ సినిమాలో. అలాగే రాముడిగానూ, రావణాసురుడి పాత్రలోనూ కూడా కనిపించాడు. తాజాగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కూడా అదే పంథాను ఫాలో చేయాలనుకుంటున్నాడు కాబోలు. ఎన్టీఆర్‌ తాజా చిత్రం బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

ఈ సినిమాలో ఎన్టీఆర్‌ది ట్రిపుల్‌ రోల్‌ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక పాత్రలో ఎన్టీఆర్‌ నెగిటివ్‌ రోల్‌ పోషిస్తున్నాడంటూ గాసిప్స్‌ వస్తున్నాయి. ఎంతవరకూ నిజమో తెలీదు కానీ, ఒకవేళ నటిస్తే ఆ పాత్రకు ఎన్టీఆర్‌ న్యాయం చేయగలడా లేదా అంటూ ఆయన ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. అలాగే స్వర్గీయ ఎన్టీఆర్‌ రక్తం ప్రవహిస్తున్న ఈ యంగ్‌ టైగర్‌కి సాధ్యం కానిది ఏదీ లేదు అని కూడా అభిప్రాయపడుతున్నారు.

అంతేకాదు ‘టెంపర్‌’ సినిమాలో ఆల్రెడీ ఎన్టీఆర్‌ నెగిటివ్‌ షేడ్స్‌ చూపించాడు. ఆ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌ అందుకుంది. కళ్యాణ్‌రామ్‌ నిర్మాణంలో తెరకెక్కబోతోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. సో ఇదే కనుక నిజమైతే ఈ సినిమాతో ఎన్టీఆర్‌ ప్రస్తుతం ఉన్న రేంజ్‌ని మించిపోయే అవకాశాలున్నాయంటున్నారు సినీ ప్రముఖులు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular