HomeMovie News Teluguబన్నీ క్రియేటివిటీ సూపరో సూపర్‌

బన్నీ క్రియేటివిటీ సూపరో సూపర్‌

సర్‌ప్రైజింగ్స్‌ ఇవ్వడంలో అల్లు అర్జున్‌ తర్వాతే ఇంకెవరైనా. తన సర్‌ప్రైజింగ్స్‌ని ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు ఫ్యాన్స్‌తో కూడా పంచుకుంటాడు బన్నీ. తాజాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన ముద్దుల కుమార్తె ఫొటోతో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు అల్లు అర్జున్‌. ఫొటోలో అల్లు అర్జున్‌ కుమార్తె అర్హ చాలా క్యూట్‌గా ఉంది కదా! పక్కనే జాతీయ జెండా కూడా ఉంది. ఇప్పటిదాకా కొడుకు అయాన్‌తో కలిసి ఇలాంటి సర్‌ప్రైజింగ్‌ క్రియేటివ్‌ ఫొటోల్ని విడుదల చేసేవాడు.

పుత్రికోత్సాహంతో ఇలా కుమార్తెతో ఫొటోల్ని విడుదల చేస్తున్నాడు అల్లు అర్జున్‌. జాతీయ జెండా, ఆ పక్కనే చిరునవ్వులు చిందిస్తున్న అర్హ చాలా అందంగా, నిండుగా కనిపిస్తున్నాయి. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘డిజె – దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమా చేస్తున్నాడు ఈ అల్లు హీరో. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ అంటూ నీట్‌గా టెక్‌ చేసుకుని క్లాసీ లుక్‌తో అలరించాడు. ఈ సినిమాలో బన్నీ బ్రాహ్మణ యువకుడిగా ఆకట్టుకోనున్నాడట.

అంతేకాదు ఇంతవరకూ రేష్‌ లుక్స్‌తో మాస్‌ డైలాగులు చెప్పిన బన్నీ, ఈ సినిమాలో చక్కగా మంత్రాలు వల్లె వేయనున్నాడట. ఇప్పటికే పంతులు గెటప్‌లో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ‘అదుర్స్‌’ సినిమాతో తన టాలెంట్‌ చూపించాడు. ఇప్పుడు బన్నీ వంతు వచ్చింది. బన్నీ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular