HomeMovie News Teluguఆర్జీవి కొత్త టార్గెట్ మహేష్ బాబు?

ఆర్జీవి కొత్త టార్గెట్ మహేష్ బాబు?

ప్రముఖ దర్శకుడు ఆర్జీవి తన సినిమాల తోనే కాకుండా ట్వీట్లతో కూడా ప్రజల్ని అలరిస్తుంటాడు. అయితే ఒక్కోసారి తన ట్వీట్లు ఆయా హీరోల ఫ్యాన్స్ ని మాత్రం తెగ ఇబ్బంది పెడుతుంటాయి.

మొన్నటి వరకు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన వర్మ ఇప్పుడు తన దృష్టి మహేష్ బాబు వైపు తిప్పాడు. నిన్న రాత్రి తన ట్వీట్ల ద్వారా మహేష్ బాబు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ పై ఎందుకు నోరు విప్పట్లేదని ప్రశ్నించాడు.

ఇంతటితో ఆగకుండా తమిళనాడు జల్లికట్టు పై ఉన్న ప్రేమ ఇక్కడ ఉన్న తెలుగు ప్రజల మీద లేదా అని సూటిగా అడిగాడు. ఆర్జీవి ట్రేడ్ మార్క్ ప్రకారం హీరోనే కాదు ఆ హీరో ఫ్యాన్స్ ని కూడా ఏదో ఒక మాట అనకుండా ఉండలేడు కదా! అందుకే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి సైతం తనకి తోచిన సలహా ఒకటి పడేసాడు.

చివరగా.. పవన్ కి ఈ ఉద్యమంలో మద్దతు ఇవ్వని ఏ హీరో అయిన ద్రోహి క్రిందనే లెక్కకట్టాడు మన ఆర్జివి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular