HomeMovie News Teluguమహేష్‌ అక్కడ అప్పుడే గెలిచేశాడు

మహేష్‌ అక్కడ అప్పుడే గెలిచేశాడు

జల్లికట్టుకి మద్దతివ్వడం ద్వారా మహేష్‌ తమిళనాడులో అప్పుడే గెలిచేశాడు. మహేష్‌ హీరోగా మురుగదాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘సంభవామి’ సినిమా తమిళంలో కూడా విడుదల కానుంది. ద్విభాషా చిత్రంగా ఇది రూపొందుతోంది. ముందు జాగ్రత్తగా తమిళ సెంటిమెంట్‌ని తనవైపుకు తిప్పుకున్నాడు మహేష్‌. దాంతో మహేష్‌ అప్పుడే ‘సంభవామి’తో తమిళ ఆడియన్స్‌ మనసుల్ని గెలిచేసుకున్నాడని అంటున్నారు. ప్రచారం కోసం కాకపోయినా, జనం సెంటిమెంట్లను గౌరవించాలి గనుక, మహేష్‌ చేసిన ప్రకటనలో హుందాతనం కనిపించింది.

మహేష్‌ వివాదాలకు అతీతుడు. కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న మహేష్‌, ఈ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంటాడని అంచనా వేయడంలో ఆశ్చర్యమేమీ లేదు. దర్శకుడు మురగదాస్‌కి తమిళ ఆడియన్స్‌ పల్స్‌ బాగా తెలుసు. అలాంటిది ఆయన దర్శకత్వంలో కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోన్న మహేష్‌కి అక్కడ సక్సెస్‌ అందడం ఖాయమనే చెప్పొచ్చు. బాలీవుడ్‌లోనూ మురుగదాస్‌ పలు సినిమాలను తెరకెక్కించాడు. ఆ సినిమాలు బాగా ఆడాయి అక్కడ.

తెలుగులోనూ మరుగదాస్‌ కథలతో వచ్చిన సినిమాలు మంచి విజయాల్ని అందుకున్నాయి. సో మురుగదాస్‌ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో పాటు భారీ అంచనాలను కూడా పెంచుతోంది. కాబట్టి తెలుగుతోపాటు, తమిళంలోనూ ‘సంభవామి’ సంచలన విజయం సాధించనుందనడం నిస్సందేహం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular