HomeMovie News Teluguఎన్టీఆర్‌తో సమంత ఇంకోస్సారి?

ఎన్టీఆర్‌తో సమంత ఇంకోస్సారి?

‘జనతా గ్యారేజ్‌’ వంటి సెన్సేషనల్‌ హిట్‌ అందుకున్న తర్వాత ఎన్టీఆర్‌ ఎలాంటి కథను ఎంచుకోవాలో తెలియక చాలా గ్యాప్‌ తీసుకున్నారు. మొత్తానికి బాబీ దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ త్రిపాత్రాభినయంలో కనిపిస్తాడన్న టాక్‌ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకు ముగ్గురు హీరోయిన్ల అవసరం కూడా ఉంది. అందుకోసమే యంగ్‌ భామలు అనుపమా పరమేశ్వరన్‌, కీర్తి సురేష్‌, రాశీఖన్నా తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.

అయితే తాజాగా ముద్దుగుమ్మ సమంత పేరు కూడా ఈ లిస్టులో చేరినట్లు సమాచారమ్‌. అయితే సమంత ఈ సినిమాలో హీరోయిన్‌గా కాకుండా, ఓ కీలకపాత్రలో నటిస్తోందంటూ గాసిప్స్‌ హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఎన్టీఆర్‌, సమంత కలిసి పలు చిత్రాల్లో నటించారు. వాటిలో ‘రభస’, రామయ్యా వస్తావయ్యా’ సినిమాలు ఆశించినంత విజయాన్ని అందుకోకపోయినా, ‘బృందావనం’, ‘జనతాగ్యారేజ్‌’ వంటి సూపర్‌ హిట్స్‌ కూడా ఉన్నాయి.

అయితే సమంతకు అక్కినేని హీరో నాగచైతన్యతో పెళ్లి కుదిరిందన్న సంగతి తెలిసిందే. ఆ కారణంగానే తెలుగు సినిమాలకేమీ కమిట్‌ కాలేదు సమ్మూ బ్యూటీ. అయితే తాజాగా వినిపిస్తోన్న ఈ గాసిప్‌తో సమంత ఫ్యాన్స్‌ హ్యాపీ ఫీలవుతున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular