HomeMovie News Teluguఖైదీకి వంద కోట్లు అఫీషియల్‌

ఖైదీకి వంద కోట్లు అఫీషియల్‌

చిరంజీవి రీ ఎంట్రీలో వచ్చిన సినిమా ‘ఖైదీ నెంబర్‌ 150’ వసూళ్ల గురించి అనేక రకాల న్యూస్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ సినిమా వసూళ్ల విషయంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వసూళ్ల లెక్క తప్పని కొంత మంది, కరెక్ట్‌ అని కొంత మంది గుసగుసలాడుకుంటున్నారు. అందుకే తాజాగా చిత్ర యూనిట్‌ మీడియా ముందుకొచ్చింది. ఈ సినిమా వసూళ్ల లెక్కను అఫీషియల్‌గా డిక్లర్‌ చేసింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

‘ఖైదీ’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన వసూళ్లు అక్షరాలా వంద కోట్లు అని అల్లు అరవింద్‌ తెలిపారు. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒక వారం రోజులు మాత్రమే గడిచింది. ఇంత తక్కువ టైంలో ఈ వసూళ్లు రావడం అన్నది చిన్న విషయం కాదు. ఈ లెక్కపై ఇంతవరకూ ఉన్న పలు అనుమానాలు అల్లు అరవింద్‌ ప్రెస్‌ మీట్‌తో క్లారిటీకి వచ్చేశారు. వినాయక్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మెగా రికార్డులు నమోదు చేసింది. మెగాస్టార్‌ రీ ఎంట్రీ సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ అయ్యింది.

అంతేకాదు ఈ సినిమా క్లాస్‌ మాస్‌ అనే తేడా లేకుండా అన్ని చోట్లా విజయం గర్వంతో దూసుకెళ్లిపోతోంది. బాస్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటే ఇదే మరి. బాస్‌ రేస్‌లోకి ఎంటరైతే వార్‌ వన్‌సైడ్‌ అయిపోద్ది అనేది ప్రాక్టికల్‌గా నిరూపించింది ఈ సినిమా. ఇదే జోరుతో మెగాస్టార్‌ 151వ సినిమాకి కూడా రంగం సిద్ధం చేసేస్తున్నారు. రామ్‌ చరణ్‌ తొలి ప్రయత్నంలో అందుకున్న సక్సెస్‌ జోరుతో నెక్స్ట్‌ సినిమాకి కూడా తానే నిర్మాణ బాధ్యతలు స్వీకరించడం విశేషం. 

You May Like This
- Advertisment -spot_img

Most Popular