HomeMovie News Teluguనిజమైతే.. చరణ్‌ గ్రేటే

నిజమైతే.. చరణ్‌ గ్రేటే

చరణ్‌ ప్రస్తుతం ‘ధృవ’ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్నాడు. మరో పక్క నాన్న చిరంజీవి 150వ సినిమా ప్రమోషన్స్‌లో కూడా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా జనాల్లోకి వెళ్లగానే చరణ్‌ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. చరణ్‌ కోసం ఇప్పుడు ప్రస్తుతం క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ రెడీగా ఉన్నాడు. రేపో మాపో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి రెడీగా ఉంది. అయితే చరణ్‌ తాజాగా మరో సినిమాకి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. అది రొమాంటిక్‌ డైరెక్టర్‌ మణిరత్నంతో.

ప్రస్తుతం మణిరత్నం అంత సక్సెస్‌లో లేడు. కానీ ఆయన దర్శకత్వంలో నటిస్తే ఏ హీరో అయినా నటనలో రాటు దేలుతాడు. అందుకే ఆయన డైరెక్షన్‌లో నటించాలన్నది ప్రతీ హీరోకీ, హీరోయిన్‌కీ ఓ కల. ఇప్పుడు ఆ ఛాన్స్‌ చరణ్‌కి వచ్చినట్లే కనిపిస్తోంది. గతంలో ‘ఆరెంజ్‌’తో ప్యూర్‌ లవ్‌స్టోరీ అంటూ డిఫరెంట్‌ అటెంప్ట్‌ చేశాడు చరణ్‌. కానీ అది బెడిసికొట్టింది. అనుకున్నంత సక్సెస్‌నివ్వలేదు. ఆ తర్వాత డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ‘ధృవ’ని టేకప్‌ చేశాడు. ఈ కొత్త ప్రయోగంతో సక్సెస్‌ అయ్యాడు.

‘ధృవ’ ఇచ్చిన స్ఫూర్తితో మళ్లీ ప్రయోగం చేయడానికి చరణ్‌ ప్లాన్‌ చేస్తున్నాడనిపిస్తోంది. అన్నీ కుదిరితే ఈ కాంబినేషన్‌లో సినిమా ఈ ఏడాదిలోనే సెట్స్‌ మీదికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ‘ధృవ’ సినిమాతో చరణ్‌లోని కొత్త యాంగిల్‌ని పరిచయం చేసిన చరణ్‌, మణిరత్నం సినిమాతో తన నటనలో ఇంకేం వేరియేషన్‌ చూపిస్తాడో చూడాలిక.

You May Like This
- Advertisment -spot_img

Most Popular