HomeMovie News Teluguరకుల్‌ హృదయం మళ్లీ స్పందించింది

రకుల్‌ హృదయం మళ్లీ స్పందించింది

సినిమాల్లో హీరోయిన్‌గా బిజీగా గడపడమే కాదు. మన చుట్టూ ఉన్న సమాజంలో ఏం జరుగుతోందో కూడా కాస్త దృష్టి పెడుతూ ఉండాలంటోంది ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌సింగ్‌. అందుకే ఆమె సమాజంలో జరిగే విషయాలకు అనుగుణంగా తన ప్రతి స్పందన తెలియజేస్తూ ఉంటుంది. తాజాగా డిశంబర్‌ 31 రాత్రి న్యూ ఇయర్‌కి వెల్‌కమ్‌ చెప్పే వేళ బెంగుళూరులో జరిగిన ఘటనకి ఆమె స్పందించింది. న్యూ ఇయర్‌లో ఈ సంఘటన పెద్ద దుమారమే అయ్యింది.

న్యూ ఇయర్‌ వేడుకలు జరుగుతున్న వేళ కొందరు ఆకతాయిలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన తీరు చాలా బాధాకరమైనది. ఈ విషయంలో పలువురు సినీ నటులు స్పందించారు. అందులో మొదటగా స్పందించింది ముద్దుగుమ్మ తాప్సీ. ఈ విషయంలో ఇంటి నుంచే మొదట మార్పు రావాలని తాప్సీ చెప్పింది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో మహిళలపై అరాచకాల నేపధ్యంలో తెరకెక్కిన సినిమాల్లో కీలకపాత్రల్లో నటిస్తోంది. అందుకే ఈ ఘటన దృష్ట్యా ముందుగా తెర పైకి వచ్చి తన స్పందన తెలియజేసింది.

అలాగే పలువురు హీరోలు కూడా స్పందించారు. అయితే అందరిలోనూ రకుల్‌ రెస్పాన్స్‌ మాత్రం హాట్‌ అండ్‌ క్యూట్‌ టాపిక్‌ అయ్యింది. ఎందుకంటే ఈమె తెరపై ఎంత క్యూట్‌గా కనిపిస్తుందో సొసైటీ బాద్యతలపై అంతకన్నా ఎక్కువ హార్డ్‌గా రెస్పాండ్‌ అవుతుంది. క్యూట్‌గా మాట్లాడడమే కాదు అంతకన్నా ఘాటుగా స్పందించి, సలహాలు ఇవ్వడం కూడా తెలుసు రకుల్‌కి. ఇది సమాజం పట్ల ఆమెకున్న బాధ్యతను తెలియజేస్తుంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular