HomeMovie News Teluguశర్వానంద్ కొత్త లగ్జరీ కారు..

శర్వానంద్ కొత్త లగ్జరీ కారు..

సినిమా సెలబ్రిటీల లైఫ్‌స్టైల్‌ ఎప్పుడూ ప్రత్యేకమే. ముఖ్యంగా వారు ఉపయోగించే కాస్ట్లీ, ప్రీమియం కార్లు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. కొత్త కారు మార్కెట్‌లోకి వచ్చినప్పుడల్లా స్టార్‌లు దానిని పరిశీలించి నచ్చితే వెంటనే తమ గ్యారేజీలోకి చేర్చుకుంటారు. అదే రూట్‌లో ఇప్పుడు యంగ్ హీరో శర్వానంద్ కూడా అడుగుపెట్టాడు. తాజా ట్రెండింగ్ వెహికల్ Lexus LM 350h Premium MPV ను తన కారు కలెక్షన్‌లో చేర్చుకున్నాడు. ఈ లగ్జరీ MPV ధర రూ.2 కోట్లకు పైగానే ఉంటుంది.

ఈ కారును ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు కొనుగోలు చేశారు. టాలీవుడ్‌లో నాగార్జున, రామ్ చరణ్ లెక్సెస్ సెగ్మెంట్ కార్లను ఉపయోగిస్తున్నారు. మాలీవుడ్‌లో ఫాహద్ ఫాజిల్ వద్ద కూడా ఈ కారు ఉందని సమాచారం. బాలీవుడ్‌లో షారుక్ ఖాన్, రణబీర్ కపూర్, జాన్వీ కపూర్ వంటి స్టార్‌లు కూడా ఈ మోడల్‌ను ఎంచుకున్నారు. సెలబ్రిటీలంతా ఇదే కారును ప్రిఫర్ చేయడానికి ప్రధాన కారణం.. సేఫ్టీ, ప్రీమియం కంఫర్ట్, అడ్వాన్స్‌డ్ ఫీచర్స్ సమపాళ్లలో అందుబాటులో ఉండటమే.

Lexus LM 350h 2.5 లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్‌తో నడుస్తుంది. 0–100 kmph వేగాన్ని కేవలం 8.7 సెకన్లలో చేరుకోవడం దీని స్పెషల్. గరిష్ట వేగం 190 kmph. ముఖ్యంగా ఈ కారు అందించే కంఫర్ట్‌ను ఫస్ట్ క్లాస్ ఎయిర్‌లైన్ అనుభవానికి సరిపోల్చుతారు. దీనికి కారణం- 48 అంగుళాల TV, ఎయిర్‌లైన్ స్టైల్ రిక్లైనర్ సీట్స్, 23 స్పీకర్ సౌండ్ సిస్టమ్, హీటెడ్ ఆర్మ్ రెస్ట్స్, ఫోల్డబుల్ టేబుల్స్, మినీ ఫ్రిజ్, డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్ వంటి అల్ట్రా లగ్జరీ ఫీచర్లు.

అందుకే ప్రీమియం లగ్జరీ + అత్యుత్తమ సేఫ్టీ + టాప్‌-క్లాస్ కంఫర్ట్ కావాలనుకునే సెలబ్రిటీలందరూ Lexus LM 350h వైపు మొగ్గు చూపుతున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular