HomeMovie News Teluguఓటీటీలోకి ‘కాంత’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

ఓటీటీలోకి ‘కాంత’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ (Dulquer Salmaan) కు తెలుగులో కూడా భారీ ఫ్యాన్ బేస్ ఉందన్న విషయం తెలిసిందే. మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో వచ్చిన ‘ఓకే బంగారం’ (OK Bangaram)తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్, మహానటి (Mahanati) తో మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’ (Sita Ramam) తో స్టార్ హీరో స్థాయికి చేరుకున్నాడు.

ఇటీవల దుల్కర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కాంత’ (Kantha) నవంబర్ 14న థియేటర్లలో విడుదలైంది. సెల్వమణి సెల్వరాజ్‌(Selvamani Selvaraj) దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియాడికల్ డ్రామా మూవీలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashree Borse) హీరోయిన్‌గా నటించగా, సముద్రఖని, దగ్గుబాటి రానా కీలక పాత్రల్లో కనిపించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది.

ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ‘కాంత’ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) సొంతం చేసుకుంది. డిసెంబర్ 12 నుంచి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. థియేటర్లలో ఓ మోస్తరు స్పందన పొందిన ఈ మూవీ, ఓటీటీలో ఏ స్థాయి విజయం సాధిస్తుందో చూడాలి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular