HomeMovie News Teluguప్రేక్షకులను ప్రిపేర్ చేసిన సంయుక్త

ప్రేక్షకులను ప్రిపేర్ చేసిన సంయుక్త

ప్రస్తుతం టాలీవుడ్ లో యమా బిజీగా ఉన్న హీరోయిన్ సంయుక్త. ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అఖండ 2 ఈ వారం రిలీజ్ కాబోతుంది. నిజానికి ఇందులో తనది హీరోయిన్ పాత్ర కాదు. ఆమెది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ మాత్రమే. ఈ విషయంలో తన వైపు నుంచి కూడా క్లారిటీ ఇచ్చేసింది సంయుక్త.

”ఇందులో ఒక ఇంపార్టెంట్ సీక్వెన్స్ లో నా పాత్ర కీలకంగా ఉంటుంది. ముందుగా ఇందులో పాట చేస్తానని కూడా నాకు తెలియదు. డైరెక్టర్ గారు చెప్పారు. నచ్చి చేశాను’ అంటూ తన పాత్ర గురించి ముందుగానే హింట్ ఇచ్చేసింది సంయుక్త.

అఖండ డివైన్ ఎమోషన్, బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమా. పార్ట్ వన్ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. అందులో హీరో హీరోయిన్ ట్రాక్ కుదిరింది. అఖండ 2 విషయానికి వచ్చేసరికి అలాంటి హీరోయిన్ ట్రాక్ ఏమీ లేదు. అందుకే సంయుక్త ని ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ గానే యూనిట్ ట్రీట్ చేస్తుంది. ప్రమోషన్స్ ఇలాంటి విషయాన్ని క్లారిటీగా చెప్పేయడమే మంచిది.

స్వయంభు, నారీ నారీ నడుమ మురారి, పూరి జగన్నాథ్, హైందవ, డార్క్ గోల్డ్ ఇలా చాలా క్రేజీ సినిమాలతో బిజీగా వుంది సంయుక్త. ఆమె సక్సెస్ రేట్ కూడా బావుంది. విరూపాక్ష, సార్, భీమ్లా, బింబిసార లాంటి విజయాలు ఆమె ఖాతాలో వున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular