HomeMovie News Teluguసమంత రింగ్‌ ధర ఎంతో తెలుసా?

సమంత రింగ్‌ ధర ఎంతో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఎట్టకేలకు రెండో పెళ్లి చేసుకున్నారు. దాదాపు నాలుగేళ్లుగా సింగిల్ లైఫ్‌లో ఉన్న ఆమె, దర్శక-నిర్మాత రాజ్ నిడిమోరును సీక్రెట్‌గా, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ ఇద్దరి రిలేషన్‌పై చాలా రోజులుగా రూమర్స్ వచ్చి పోయాయి. చివరకు వాటికి ముగింపు పలుకుతూ పెళ్లితో అధికారికం చేశారు.

అయితే సమంత రెండో పెళ్లి నేపథ్యంలో ఆమె ఎంగేజ్మెంట్ రింగ్ గురించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ రింగ్‌ ధర ఎంతంటే అందరూ ఆశ్చర్యపోయేలా ఉందట.

సమంత ధరించిన రింగ్‌ విలువ ఎంత?

జ్యువెలరీ నిపుణులు ప్రియాంష్ గోయల్ తెలిపిన వివరాల ప్రకారం.. సమంత రింగ్‌ ధర దాదాపు ₹1.5 కోట్లు.. మధ్యలో ఉన్న 2 క్యారెట్ల లోజెంజ్ కట్ డైమండ్.. దాని చుట్టూ 8 పోట్రెయిట్ కట్ డైమండ్ పెటల్స్.. ఇటువంటి యూనిక్ డిజైన్స్‌ను ప్రపంచంలో కేవలం కొద్ది మంది నిపుణులే తయారు చేయగలరు. సింపుల్‌గా కనిపించినా, ఆ రింగ్ వెనుక ఉన్న కళ, కృషి మాత్రం అద్భుతమట.

చరిత్రకారుల ప్రకారం.. మొగల్ రాజులు ఈ తరహా రింగ్స్‌ను ఎంతో ఇష్టపడేవారట. తాజ్ మహల్ నిర్మించిన షాజహాన్ భార్య ముంతాజ్ కూడా ఇలాంటి రింగ్స్‌కి అభిమానిని అని రికార్డులు చెబుతున్నాయి. అలాంటి రేర్, రోయల్ డిజైన్‌లో తయారైన రింగే ఇప్పుడు సమంత వేలిని అందంగా అలంకరిస్తోంది. పెళ్లి ఫోటోల్లో ఈ రింగ్ స్పష్టంగా కనిపించడంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

వివాహం ఎలా జరిగింది?

సమంత–రాజ్ నిడిమోరు వివాహం కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ యోగా సెంటర్ వద్ద ఉన్న లింగ భైరవి ఆలయంలో, భూత శుద్ధి సంప్రదాయం ప్రకారం జరిగింది. సింపుల్‌గా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular