సోషల్ మీడియా ట్రోలింగ్ రోజురోజుకూ పెరిగిపోతుంది. లైకులు, వ్యూస్ కోసం కొందరు హద్దులు దాటి అసభ్యకర కామెంట్స్ చేయడం, వ్యక్తులను టార్గెట్ చేయడం కామన్ అయిపోయింది. తాజాగా ఫోక్ సింగర్ మంగ్లీ కూడా ఇలాంటి అనుభవానికే గురయ్యారు.
రీసెంట్గా విడుదలైన ఆమె పాట ‘‘బాయిలోనే బల్లిపలికే’’ యూట్యూబ్‌లో భారీగా వైరల్ అవుతోంది. ఐదు రోజుల్లోనే 8 మిలియన్‌కు పైగా వ్యూస్ దక్కించుకుంది. పాట హిట్ అవుతుండగా, సోషల్ మీడియాలో ఒక వ్యక్తి ఈ పాటపై అసభ్యకరంగా కామెంట్లు చేస్తూ వీడియో రిలీజ్ చేయడంతో వివాదం చెలరేగింది.
ఈ వీడియో నెట్టింట వేగంగా వైరల్ కావడంతో, మంగ్లీ గురువారం ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ పాటను కించపరుస్తూ, అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో పాటు ఎస్టీ కమ్యూనిటీని అవమానించేలా మాట్లాడాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మంగ్లీని క్షమాపణలు కోరిన మేడిపల్లి స్టార్!
ఇటీవల విడుదలైన మంగ్లీ కొత్త పాట 'బాయిలోనే బల్లి పలికే..'ని కించపరుస్తూ మంగ్లీపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తి
ఈ క్రమంలోనే 'మేడిపల్లి స్టార్' అనే పేరు గల ఇన్స్టాగ్రామ్ యూజర్‌ను అదుపులోకి తీసుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు https://t.co/ZGipW0Dh5i pic.twitter.com/AMwfRGcgbt
— BIG TV Breaking News (@bigtvtelugu) November 28, 2025
ఫిర్యాదు చేసిన కొద్ది గంటల్లోనే పోలీసులు నిందితుడిని.. సోషల్ మీడియాలో ‘మేడిపల్లి స్టార్’ పేరిట రీల్స్ చేసే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
తరువాత నిందితుడు వీడియో విడుదల చేసి క్షమాపణలు కోరుతూ మంగ్లీ ని చేతులెత్తి వేడుకున్నాడు. “ట్రోల్ చేయాలనే ఉద్దేశ్యం కాదు.. పాట ట్రెండింగ్‌లో ఉండటంతో వచ్చిన కామెంట్స్‌ను చూపిస్తూ వీడియో చేసాను” అంటూ వివరణ ఇచ్చాడు. ఇకపై ఇలాంటి తప్పులు చేయనని.. తనను విడిచిపెట్టాలని కోరాడు.
అయితే పోలీసులు చెబుతున్నదేమిటంటే.. నిందితుడు గతంలో కూడా సోషల్ మీడియాలో ఇలాంటి అసభ్యకర కామెంట్స్ చేసినట్లు రికార్డులు ఉన్నాయని తెలిపారు.





