HomeMovie News Teluguరవితేజ కి నో చెప్పిన సామ్ !?

రవితేజ కి నో చెప్పిన సామ్ !?

పాన్ ఇండియా మానియాతో టాలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్స్ తెరపైకి వస్తున్నాయి. ఇదే క్రమంలో రీసెంట్ గా ఒక క్రేజీ కాంబో గూర్చి సోషల్ మీడియాలో న్యూస్ హల్చల్ చేసింది. వాళ్ళు మరెవరో కాదు మాస్ మహారాజ్ రవితేజ, సమంత. స్టార్ హీరోలందరితో నటించిన సమంత రవితేజ తో నటించలేదు. ఫైనల్లి ఈ జోడీని తెరపై చూడనున్నామని ఆడియన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ ఇప్పుడు అసలు విషయం తెలిసి నిరుత్సాహ పడుతున్నారు. కారణం రవితేజ కి సామ్ నో చెప్పటమే.

రవితేజ వరుస దండయాత్రలు చేస్తున్నా హిట్ రావటం లేదు. ఒక దాన్ని మించి ఒకటి డిజాస్టర్ గా నిలుస్తోంది. ధమాకా తర్వాత రవి తేజ కి హిట్ అన్న మాట లేదు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్, మాస్ జాతర వరుస ఫ్లాప్స్. ప్రజంట్ రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమా చేస్తున్నాడు. తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలవనున్నట్లు తెలుస్తోంది.

నెక్స్ట్ రవి తేజ శివ నిర్వాణ కాంబోలో ఒక ప్రాజెక్ట్ ఓకే అయ్యింది. ఈ మూవీలో రవి తేజ కి జోడీగా సమంత ఫిక్స్ అయినట్టు ప్రచారం జరిగింది. సమంత – శివ నిర్వాణతో మజిలీ, ఖుషీ సినిమాలు చేసింది. అందుకే మళ్ళీ శివ సామ్ కి ఓటు వేసాడు. లాంగ్ గ్యాప్ తీసుకున్న సామ్ మాస్ రాజా తో ఎంట్రీ ఇస్తుందని అంతా భావించారు. కానీ వరుస ఫ్లాప్స్ లో ఉన్న రవి తేజ తో నటించటానికి సామ్ నో చెప్పినట్లు తెలుస్తోంది. సామ్ ప్లేస్ లో ప్రియా భవాని శంకర్ ని తీసుకున్నారని సమాచారం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular