HomeMovie News Teluguబాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర ఇక లేరు

బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర ఇక లేరు

బాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతిలో ఉంది. కారణం ఒకప్పటి స్టార్ హీరో ధర్మేంద్ర సోమవారం ఉదయం కనుమూశారు. కొన్ని రోజులగా అనారోగ్యం తో హాస్పటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ధర్మేంద్ర ఆరోగ్యం విషమించి తుది శ్వాస విడిచారు. ధర్మేంద్ర హాస్పటల్ లో అడ్మిట్ అవగానే మరణించినట్లు న్యూస్ రాగా దానిని ఫ్యామిలీ మెంబర్స్ కండించారు. తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కూతురు అనౌన్స్ చేసి, తప్పుడు వార్తలు రాసినందుకు మీడియాపై మండి పడ్డారు. అంతే కాదు రెండు రోజుల క్రితం ధర్మేంద్ర కోలుకున్నారని హాస్పటల్ నుంచి డిశ్చార్జ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

ఇంతలోనే మళ్ళీ ధర్మేంద్ర ఆరోగ్యం విషమించి సోమవారం ఉదయం మరణించినట్లు తెలుస్తోంది. 89 ఏళ్ళ ధర్మేంద్ర మరణంతో బాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఫాన్స్, నెటిజన్లు ధర్మేంద్ర కి నివాళులు అర్పిస్తున్నారు. ధర్మేంద్ర చివరి చూపు కోసం బాలీవుడ్ స్టార్స్ తరలి వెళ్తున్నారు. 89 ఏళ్ల వయసులో కూడా ధర్మేంద్ర ఇప్పటికీ సినిమాల్లో నటిస్తుండటం గమనార్హం. ధర్మేంద్ర లాస్ట్ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కానుంది. ధర్మేంద్ర 300కు పైగా సినిమాల్లో నటించారు. యాక్షన్ కింగ్, బాలీవుడ్ ‘హీ మ్యాన్’ అని పేరు పేరొందారు. ధర్మేంద్ర పిల్లలు బాబీ డియోల్, సన్నీ డియోల్, ఇషా డియోల్, అహనా డియోల్ కూడా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular