బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) పుట్టినరోజును పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అనిల్‌ను కలుసుకుని, ఒక అందమైన వాచ్‌ను గిఫ్ట్‌గా అందించారు. కేక్ కట్ చేసి బర్త్‌డేను సెలబ్రేట్ చేయగా, చిరంజీవి ఇచ్చిన ఈ సర్ప్రైజ్ మరియు హృదయపూర్వక శుభాకాంక్షలు అనిల్‌కు మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్‌గా నిలిచాయి.

ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana Shankara Varaprasad Garu) రూపొందుతోంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు సాంగ్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ముఖ్యంగా ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ రికార్డు స్థాయి వ్యూస్ సాధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు సినిమా మ్యూజిక్‌కు ఇది కొత్త బెంచ్‌మార్క్‌గా నిలిచింది.

సాహూ గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ 2026 సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల కానుంది.





