HomeMovie News Teluguమహేశ్ బాబు-రాజమౌళి ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ దుమ్మురేపింది!

మహేశ్ బాబు-రాజమౌళి ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ దుమ్మురేపింది!

సూపర్ స్టార్ మహేశ్ బాబు-దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. చివరికి ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన టైటిల్ రివీల్ ఈ రోజు గ్రాండ్‌గా జరిగింది.

హైదరాబాద్ శివార్లలో అత్యంత భారీ స్థాయిలో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌లో మేకర్స్ SSMB29కి ‘వారణాసి’ (Varanasi) అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌తో పాటు విడుదల చేసిన గ్లింప్స్ వీడియో ఫ్యాన్స్‌ను పిచ్చెక్కిస్తోంది.

ఈ గ్లింప్స్‌లో మహేశ్ బాబు పూర్తిగా కొత్త వైల్డ్ లుక్‌లో కనిపించారు. రఫ్ బీర్డ్ స్టైల్, ఇంటెన్స్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మహేశ్ బాబు మరింత స్టైలిష్‌గా కనిపించడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నారు. రిలీజ్ అయిన కొద్ది నిమిషాలకే ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది.

ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే మేకర్స్ బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రాను ‘మందాకిని’గా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ను ‘కుంభ’గా పరిచయం చేసి భారీ హైప్ క్రియేట్ చేశారు.

ప్రపంచ స్థాయి యాక్షన్ అడ్వెంచర్ కన్సెప్ట్‌తో వస్తున్న ‘వారణాసి’ ఇప్పుడు పాన్-వరల్డ్ మూవీగా హాట్ టాపిక్ అయింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular