మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi) నుంచి ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. చిత్రబృందం ఫస్ట్ సింగిల్ ‘చికిరి.. చికిరి’ సాంగ్‌ను రిలీజ్ చేసి అభిమానుల దాహం తీర్చేశారు. పాట రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాను కుదిపేస్తోంది.
ఈ పాటలో రామ్ చరణ్ (Ram Charan) వేసిన హుక్ స్టెప్ అభిమానుల్ని ఫిదా చేసింది. జాన్వీ కపూర్ తన ఘాటు లుక్స్ మరియు గ్రేస్‌ఫుల్ మూవ్స్‌తో స్క్రీన్‌ను హీట్ పెంచేసింది. బాలాజీ రాసిన లిరిక్స్‌కి ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం జత కావడంతో ఈ సాంగ్ మంత్ర ముగ్ధులను చేస్తోంది.
‘చికిరి.. చికిరి’ పాటకు వచ్చిన రెస్పాన్స్ అద్భుతం. యూట్యూబ్‌లో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే ట్రెండింగ్ లిస్ట్‌లోకి ఎగబాకింది. రామ్ చరణ్ డాన్స్, జాన్వీ ఆకర్షణ, రెహమాన్ మ్యూజిక్.. ఈ కాంబినేషన్ ఫ్యాన్స్‌లో క్రేజ్ సృష్టిస్తోంది.
బుచ్చిబాబు సనా (Buchibabu Sana) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. దివ్యేందు శర్మ, జగపతి బాబు, శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఉత్తరాంధ్ర నేపథ్యంలోని పీరియాడికల్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా, ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదల కానుంది.





