రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఫౌజీ’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి అత్యంత గ్రాండ్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రం, ప్రభాస్ కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘ఫౌజీ’ పౌరాణిక చిత్రం కాదని, కానీ భగవద్గీత నుంచి తాత్విక స్ఫూర్తి తీసుకున్న సినిమా అని చిత్ర బృందం ఇప్పటికే స్పష్టంచేసింది. ఈ కథ బ్రిటిష్ కాలం నాటి రాజకీయ, సామాజిక నేపథ్యంలో నడవనుందని సమాచారం.
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మహేష్ బాబు మేనల్లుడు, హీరో సుధీర్ కుమారుడు దర్శన్ ‘ఫౌజీ’లో నటిస్తున్నట్లు సమాచారం. ఆయన ప్రభాస్ చిన్ననాటి పాత్రలో కనిపించబోతున్నారట. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఇప్పటికే హాట్ టాపిక్‌గా చర్చ నడుస్తోంది.
అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే సమయంలో, దర్శన్ మహేష్ బాబు నిర్మిస్తున్న ‘గూడచారి 2’ లో కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఇటీవలే వార్తలు బయటికి వచ్చాయి.





