HomeMovie News Teluguదీపావళి కానుకగా మెగాస్టార్ చిరంజీవి నుంచి సర్ప్రైజ్ ట్రీట్.. కొత్త పోస్టర్ అదుర్స్!

దీపావళి కానుకగా మెగాస్టార్ చిరంజీవి నుంచి సర్ప్రైజ్ ట్రీట్.. కొత్త పోస్టర్ అదుర్స్!

దీపావళి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు దర్శకుడు అనిల్ రావిపూడి నుంచి సూపర్ ట్రీట్ లభించింది. మెగాస్టార్ నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) నుంచి కొత్త పోస్టర్‌ను చిత్రం బృందం విడుదల చేసింది.

ఈ పోస్టర్‌లో చిరంజీవి ఇద్దరు చిన్నారులతో కలిసి సైకిల్ తొక్కుతూ కనిపించారు. కళ్లజోడు, మంకీ క్యాప్‌, క్యాజువల్ టీషర్ట్‌లో చిరు స్మార్ట్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకున్నారు. పోస్టర్ చూస్తుంటే సినిమా కథ మొత్తం ఆ ఇద్దరు పిల్లల చుట్టూ తిరిగే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది.

ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ పాట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సినిమా యూనిట్ ప్రకారం, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular