HomeMovie News Teluguమొన్న నిశ్చితార్థం.. నిన్న యాక్సిడెంట్‌! సేఫ్‌గా ఉన్నానన్న హీరో విజయ్ దేవరకొండ

మొన్న నిశ్చితార్థం.. నిన్న యాక్సిడెంట్‌! సేఫ్‌గా ఉన్నానన్న హీరో విజయ్ దేవరకొండ

టాలీవుడ్‌ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కారు ప్రమాదానికి (Car Accident) గురయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే అదృష్టవశాత్తు విజయ్ సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటన తరువాత విజయ్‌ తన స్నేహితుడితో కలిసి హైదరాబాద్‌కు తిరిగి వెళ్లిపోయారు.

విజయ్‌ కారు డ్రైవర్‌ అందె శ్రీకాంత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఉండవల్లి ఎస్‌.ఐ ఆర్‌.శేఖర్ తెలిపారు. సమాచారం ప్రకారం, విజయ్‌ తన స్నేహితులతో కలిసి పుట్టపర్తికి వెళ్లి వస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది.

పుట్టపర్తిలోనే చదువుకున్న విజయ్ దేవరకొండకు సత్యసాయి బాబాపై గాఢమైన విశ్వాసం ఉంది. ఆదివారం ఆయన మహా సమాధిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ప్రమాదం జరిగింది.

“నాకేం కాలేదు.. సేఫ్‌గానే ఉన్నాను” – విజయ్ దేవరకొండ

ప్రమాదం తర్వాత విజయ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ X (Twitter) లో స్పందించారు. “నాకేం కాలేదు.. అంతా బాగానే ఉంది. కారు మాత్రం దెబ్బతింది కానీ మేమంతా సేఫ్‌గానే ఉన్నాం. ఇప్పుడే స్ట్రెంగ్త్‌ వర్కౌట్స్‌ పూర్తి చేశాను. మీ అందరికీ నా ప్రేమ, హగ్స్‌” అంటూ పోస్ట్‌ చేశారు.

ఇటీవల రష్మిక మందన్నాతో విజయ్ దేవరకొండ నిశ్చితార్థం జరిగినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరి ఎంగేజ్‌మెంట్‌ విజయ్‌ ఇంట్లోనే జరిగినట్లు సమాచారం. ఫిబ్రవరిలో వీరిద్దరి పెళ్లి జరగనుందని చెబుతున్నారు. అయితే, దీనిపై విజయ్‌ గాని రష్మిక గాని ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం విజయ్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రానికి సిద్ధమవుతున్నారు. అదనంగా, రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో మరో ప్రాజెక్ట్‌లో కూడా నటించనున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular