HomeMovie News TeluguBigg Boss 9: కంటెస్టెంట్స్‌కి బిగ్ షాక్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారంటే?

Bigg Boss 9: కంటెస్టెంట్స్‌కి బిగ్ షాక్.. ఈ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారంటే?

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఇష్టంగా చూస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్ 9’ నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఈ సీజన్‌లో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. వీరిలో 9 మంది సెలబ్రిటీలు కాగా, 6 మంది కామనర్స్. ప్రతి వారమూ ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతున్నాడు.

మొదటి వారంలో శ్రేష్టి వర్మ, రెండో వారంలో మర్యాద మనీష్, మూడో వారంలో ప్రియ, నాలుగో వారంలో హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఇప్పుడు ఇంట్లో.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన దివ్య తో కలిపి 12 మంది మాత్రమే మిగిలారు.

సండే ఎపిసోడ్‌లో సరదా టాస్కులతో పాటు నాగ్‌ (Nagarjuna) కొందరికి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. సోమవారం నామినేషన్స్ రౌండ్‌లో అన్ని కంటెస్టెంట్స్ బయటకు వచ్చి నిలబడగా, బిగ్‌బాస్ నామినేట్ అయిన వారి పేర్లు చెప్పడంతో అందరూ షాక్‌ అయ్యారు.

ఈ వారం కెప్టెన్‌గా ఉన్న రామ్ రాథోడ్ సేఫ్ కాగా, నామినేషన్స్‌లో భరణి, సుమన్ శెట్టి (Suman Shetty), షైనీ ఫ్లోరా, ఇమాన్యుయేల్ (Emmanuel), సంజన, దమ్ము శ్రీజ, కళ్యాణ్, డిమాన్ పవన్, రీతూ చౌదరి, తనూజ (Tanuja), దివ్య నామినేట్ అయ్యారు.

తర్వాత బిగ్‌బాస్ ఇమ్యూనిటీ కోసం ఒక గేమ్‌ను పెట్టాడు. ఇందులో డిమాన్ పవన్, భరణి పోటీపడగా ఇద్దరూ కిందపడిపోయారు. దీంతో బిగ్‌బాస్ ఒకరిని అవుట్ చేయమని అడగగా, ఫ్లోరా డిమాన్ పవన్‌ను తొలగించింది. ప్రోమో ఇక్కడితో ముగిసింది. ఇక ఈ వారం నామినేట్ అయిన పది మందిలో ఎవరికి ఇమ్యూనిటీ లభిస్తుందనే సస్పెన్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular