బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్(Ajay Devgan) భార్య, ప్రముఖ నటి కాజోల్ దేవగన్(Kajol Devgan) ఇటీవల దుర్గాపూజా వేడుకల్లో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ముంబైలో జరిగిన దసరా ఉత్సవాల్లో ఆమె పాల్గొన్న సమయంలో ఓ వ్యక్తి అసభ్యంగా తాకిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా విజయదశమి రోజున కాజోల్ తన కుటుంబంతో కలిసి దుర్గా పూజా మండపానికి వెళ్లారు. సంప్రదాయ చీర కట్టుకుని, నుదుటున సింధూరం పెట్టుకుని ఆమె పూజల్లో పాల్గొన్నారు. అనంతరం పూజలు ముగించుకుని మెట్లు దిగుతుండగా, అక్కడున్న ఓ వ్యక్తి ఆమెను అనూహ్యంగా ఛాతిపై తాకాడు.
एक्ट्रेस काजोल का एक वीडियो इंटरनेट पर बहुत वायरल है।
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) October 3, 2025
मुंबई के सर्बोजनिन दुर्गा पंडाल में कल बॉलीवुड कलाकारों का जमावड़ा लगा था। काजोल भी वहां मौजूद थी। एक हाथ किसी का आता है उनकी तरफ और चेहरे का एक्सप्रेशन बताता है कुछ गलत हुआ।#Kajol #DurgaPandal #ViralVideo #BollywoodBuzz… pic.twitter.com/lbwkou5BpJ
వీడియోలో కాజోల్ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురై కోపంగా వెనక్కి తిరిగి ఆ వ్యక్తిని చూసిన దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఆ తర్వాత కాజోల్ ఆ వ్యక్తితో మళ్లీ సాధారణంగా వ్యవహరిస్తూ సెల్ఫీ దిగినట్లు కూడా వీడియోలో ఉంది.
ఈ వీడియో బయటకు రాగానే నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కొందరు ఆ వ్యక్తి కావాలనే అసభ్యంగా ప్రవర్తించాడని విమర్శిస్తుండగా, మరికొందరు మాత్రం రద్దీలో పొరపాటున జరిగి ఉండవచ్చని చెబుతున్నారు. ఏది ఏమైనా, ప్రస్తుతం ఈ సంఘటన నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.





