HomeMovie News TeluguNBK111 టైటిల్ అనౌన్స్‌మెంట్‌కు డేట్ ఫిక్స్..

NBK111 టైటిల్ అనౌన్స్‌మెంట్‌కు డేట్ ఫిక్స్..

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘NBK111’. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు.

ఇటీవల యాక్షన్ సీన్ చిత్రీకరణ సమయంలో బాలకృష్ణ గాయపడటంతో షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరో ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన ఫ్యాన్స్‌కు చిత్ర బృందం అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా టైటిల్‌ను సెప్టెంబర్ 6న అధికారికంగా ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ విడుదల చేసిన పవర్‌ఫుల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “ఆ సింహాన్ని బయటకు వదిలింది ఎవరు?” అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ వీడియో బాలయ్య అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది.

ఇదిలా ఉంటే.. సినిమా టైటిల్ విషయంలో ఇప్పటికే ‘గాడ్’, ‘దాదా’ అనే పేర్లు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ‘దాదా’ అనే టైటిల్‌ను ఖరారు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక క్లారిటీ మాత్రం సెప్టెంబర్ 6న టైటిల్ రివీల్‌తోనే రానుంది.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. బాలకృష్ణను పవర్‌ఫుల్ యాక్షన్ అవతార్‌లో చూపించేందుకు గోపీచంద్ మలినేని ప్రత్యేకంగా కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ మూడో వారంలో క్రిస్మస్ కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

You May Like This
- Advertisment -spot_img

Most Popular