HomeMovie News Teluguయేష నాగుల కట్టమీద సాంగ్‌తో నాని మాస్ జాతర..

యేష నాగుల కట్టమీద సాంగ్‌తో నాని మాస్ జాతర..

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. గతంలో వచ్చిన ‘దసరా’ విజయంతో ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు తొలి సింగిల్ ‘ఆయా షేర్’కు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘యేష నాగుల కట్టమీద’ అంటూ సాగే సెకండ్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. అమెరికాలోని డల్లాస్‌లో జరిగిన అనిరుధ్ లైవ్ కాన్సర్ట్‌లో వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ పాటను గ్రాండ్‌గా లాంచ్ చేశారు.

తెలంగాణ జానపద బాణీకి అనిరుధ్ తనదైన మాస్ టచ్‌ను జోడించి ఈ పాటను రూపొందించారు. కాసర్ల శ్యామ్ అందించిన లిరిక్స్‌లో పక్కా పల్లెటూరి నేటివిటీ కనిపించగా.. జంగి రెడ్డి, ప్రభల గాత్రం పాటకు మరింత ఎనర్జీని తీసుకొచ్చింది.

ఆట సందీప్ కొరియోగ్రఫీ చేసిన మాస్ స్టెప్పులు సాంగ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా నాని తనదైన స్టైల్, యాటిట్యూడ్‌తో వేసిన డ్యాన్స్ మూవ్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. పాటలో కీర్తి సురేష్ కూడా మెరిసి నానికి మంచి జోడీగా కనిపించారు.

జానపద టచ్‌కు మాస్ బీట్స్ తోడవడంతో ‘యేష నాగుల కట్టమీద’ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. థియేటర్లలోనే కాకుండా రాబోయే రోజుల్లో పార్టీలు, ఫంక్షన్లు, పండుగల్లోనూ ఈ పాట మార్మోగే అవకాశం కనిపిస్తోంది.

కాగా, ఈ సినిమాలో మోహన్ బాబు, కాయదు లోహర్, రాఘవ్ జుయల్, సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని సెప్టెంబర్ 24న తెలుగు, తమిళం, హిందీతో పాటు ఇంగ్లిష్, స్పానిష్ సహా మొత్తం 8 భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular