మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఇరుముడి’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద జోరుగా దూసుకుపోతోంది. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా భారీ వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. సినిమాకు వస్తున్న స్పందనతో రవితేజ అభిమానుల్లోనూ ఉత్సాహం మరింత పెరిగింది.
తాజాగా మూవీ టీమ్ మూడు రోజుల కలెక్షన్ల వివరాలను అధికారికంగా వెల్లడించింది. ‘ఇరుముడి’ ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఎలాంటి టికెట్ ధరల పెంపు లేకుండా, ఎలాంటి పండుగ సీజన్లో విడుదల కాకుండానే ఒక ప్రాంతీయ సినిమా ఈ స్థాయిలో మూడు రోజుల్లో వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి అని చిత్ర బృందం పేర్కొంది.
దీంతో ‘ఇరుముడి’ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతం సినిమాకు వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్, బాక్సాఫీస్ జోరు చూస్తుంటే రానున్న రోజుల్లోనూ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మూడు రోజుల్లోనే రూ.80 కోట్ల మార్క్ను దాటిన ‘ఇరుముడి’ ఫుల్ రన్లో ఎలాంటి వసూళ్లను సాధిస్తుందనే ఆసక్తి ఇప్పుడు అందరిలోనూ నెలకొంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి.






