HomeMovie News Teluguఓటీటీలోకి రావు బహదూర్.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్!

ఓటీటీలోకి రావు బహదూర్.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్!

విభిన్నమైన కథలు, పాత్రలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సత్యదేవ్ హీరోగా, దర్శకుడు వెంకటేష్ మహా తెరకెక్కించిన తాజా చిత్రం ‘రావు బహదూర్’. ఈ సినిమాలో సత్యదేవ్ సరసన దీపా థామస్ హీరోయిన్‌గా నటించగా, సూపర్ స్టార్ మహేష్ బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ఈ చిత్రం రూపొందింది.

సైకాలజికల్ డ్రామాగా తెరకెక్కిన రావు బహదూర్ జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విడుదలకు ముందు వచ్చిన టీజర్, ట్రైలర్‌లతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

అయితే సినిమా కమర్షియల్‌గా నిరాశపరిచినా, సత్యదేవ్ నటన, వెంకటేష్ మహా దర్శకత్వం, కథలోని భావోద్వేగాలు, ఇంటెన్స్ నేరేషన్‌కు విమర్శకులు, సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు లభించాయి.

థియేట్రికల్ రన్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, జూలై 31 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

అంతేకాదు, ఈ చిత్రాన్ని కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ఒకేసారి విడుదల చేయనున్నారు. దీంతో థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular