HomeMovie News Teluguఫౌజీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్ వైరల్

ఫౌజీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రభాస్ పవర్‌ఫుల్ లుక్ వైరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస భారీ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘ఫౌజీ’ ఒకటి. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ వార్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రేమ, దేశభక్తి, యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్వాతంత్య్ర పోరాట కాలంలో తిరుగుబాటుదారుడిగా మారిన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికుడి పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. ప్రభాస్ సరసన ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.

ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైనప్పటికీ, తొలి పోస్టర్ తర్వాత చిత్రబృందం ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కొత్త పోస్టర్ లేదా గ్లింప్స్ విడుదల చేయాలని నిరంతరం కోరుతూ వస్తున్నారు.

అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ దర్శకుడు హను రాఘవపూడి భారీ అప్‌డేట్ ప్రకటించారు. ‘ఫౌజీ’ చిత్రాన్ని 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ‘2026 డిసెంబర్ 3 నుంచి ఫౌజీ ప్రయాణం థియేటర్లలో ప్రారంభమవుతుంది. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ధైర్యం, గౌరవం, స్వేచ్ఛను నమ్మే ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయే కథ’ అని ఆయన పేర్కొన్నారు.

రిలీజ్ డేట్‌తో పాటు విడుదల చేసిన కొత్త పోస్టర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పోస్టర్‌లో ప్రభాస్ ఒళ్లంతా రక్తంతో తడిసిపోయి, చేతిలో భారీ తుపాకి పట్టుకుని శవాల మధ్య కూర్చున్న పవర్‌ఫుల్ అవతారంలో కనిపించారు. ఈ మాస్ లుక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, అభిమానుల్లో సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

ప్రస్తుతం ఈ పోస్టర్‌కు నెటిజన్ల నుంచి భారీ స్పందన వస్తోంది. ‘ప్రభాస్ లుక్ నెక్స్ట్ లెవెల్’, ‘ఇలాంటి పోస్టర్ అస్సలు ఊహించలేదు’, ‘ఫౌజీ కోసం వెయిటింగ్’ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లతో హల్‌చల్ చేస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular