మెగాస్టార్ చిరంజీవి తనకు నచ్చిన సినిమాలు, నటీనటులను సోషల్ మీడియా వేదికగా అభినందించడం కొత్తేమీ కాదు. తాజాగా అక్కినేని అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ‘లెనిన్’ చిత్రం మంచి స్పందనతో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో చిరంజీవి ప్రత్యేకంగా స్పందించారు.
‘లెనిన్’ సినిమాపై అద్భుతమైన స్పందనలు వింటున్నానని, ముఖ్యంగా అఖిల్ అక్కినేని నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు రావడం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. ‘అఖిల్ నాకు మరో కుమారుడిలాంటి వాడు. ప్రతి సినిమాతో నటుడిగా అతడు మరింత ఎదుగుతున్న తీరు చూడటం చాలా సంతోషంగా ఉంది’ అంటూ ఆయన తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.
అలాగే, తన ప్రియ మిత్రుడు నాగార్జునకు, చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. త్వరలోనే ‘లెనిన్’ సినిమా చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని, ఈ చిత్రం మరింత పెద్ద విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
చిరంజీవి చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కూడా ఆయన వ్యాఖ్యలను స్వాగతిస్తూ అఖిల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ చిత్రానికి ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించగా, అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, నాగ వంశీ సంయుక్తంగా నిర్మించారు. ప్రస్తుతం ‘లెనిన్’ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
Hearing wonderful things about #Lenin. Delighted by the unanimous appreciation, especially for @AkhilAkkineni8’s performance. Akhil is very dear to me, like another son and it’s a joy to see him grow with every film.
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 13, 2026
Congratulations to my dear friend @iamnagarjuna, the entire…





