HomeMovie News Teluguలెనిన్ సెన్సార్ రిపోర్ట్..

లెనిన్ సెన్సార్ రిపోర్ట్..

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగా, చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, ప్రచార వీడియోలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలు, ఇంటెన్స్ ఎమోషనల్ ఎపిసోడ్‌లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా U/A సర్టిఫికెట్ రావడంతో, ఈ చిత్రంలో యాక్షన్‌కు పెద్దపీట వేసినట్లు స్పష్టమవుతోంది.

ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. బ్రహ్మాజీ, శివాజీ, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మించారు.

భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular