తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రంపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ప్రారంభంలో ఈ సినిమాపై సాధారణ స్థాయిలో ఆసక్తి ఉన్నప్పటికీ, సూర్య నటించిన ‘కరుప్పు’ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన నేపథ్యంలో, సూర్య తదుపరి చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ పై ట్రేడ్ వర్గాల్లో భారీ బజ్ ఏర్పడింది.
తాజాగా సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి విడుదలకే ముందే రూ.300 కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ డీల్స్‌తో నిర్మాతలు ఇప్పటికే సేఫ్ జోన్‌లోకి వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సంఖ్యలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ చిత్రాన్ని ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో మమితా బైజు కీలక పాత్రలో నటిస్తుండగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచనాల నడుమ విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





