HomeMovie News Teluguటాక్సిక్ నుంచి లేడీస్ & లేడీస్ గ్లింప్స్ రిలీజ్..

టాక్సిక్ నుంచి లేడీస్ & లేడీస్ గ్లింప్స్ రిలీజ్..

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఎన్నో వాయిదాల తర్వాత ఈ చిత్రాన్ని ఆగస్టు 26న తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా చిత్రబృందం ‘లేడీస్ & లేడీస్’ పేరుతో ఓ ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది. స్టైలిష్ విజువల్స్, రా అండ్ రస్టిక్ టోన్, యాక్షన్‌తో కూడిన ఈ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఈ గ్లింప్స్‌లో గంగా పాత్రలో నయనతార, మెల్లిసాగా రుక్మిణి వసంత్, నదియాగా కియారా అద్వానీ, ఎలిజబెత్ పాత్రలో హుమా ఖురేషి, రెబెక్కాగా తారా సుతారియా ప్రత్యేకంగా కనిపించారు. ప్రతి పాత్రకు భిన్నమైన పరిచయాన్ని ఇవ్వడంతో పాటు, సినిమాలో మహిళా పాత్రల ప్రాధాన్యాన్ని ఈ వీడియో హైలైట్ చేసింది.

‘లేడీస్ & లేడీస్… ఒక్కొక్కరిగా వస్తారా.. ఒకేసారి వస్తారా?’ అనే డైలాగ్‌తో ముగిసిన ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టైలిష్ మేకింగ్, యాక్షన్ ఎలిమెంట్స్, పాత్రల ప్రెజెంటేషన్‌తో ఈ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచిందని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular