HomeMovie News Teluguపారిస్‌లో రాజమౌళికి అరుదైన గౌరవం..

పారిస్‌లో రాజమౌళికి అరుదైన గౌరవం..

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. భారతీయ సినీ పరిశ్రమను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయనకు ఫ్రాన్స్‌లోని పారిస్ నగరంలో ప్రతిష్టాత్మక సత్కారం లభించింది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్‌ వరల్డ్ చిత్రం వారణాసి షూటింగ్‌తో బిజీగా ఉన్న రాజమౌళి, ఇటీవల ఫ్రాన్స్ పర్యటనలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పారిస్‌లోని ప్రముఖ సినిమాటిక్ ఫ్రాంచైజ్ ఆర్ట్స్ సెంటర్‌లోని హెన్రీ లాంగ్లోయిస్ హాల్‌లో రాజమౌళి పేరుతో శాశ్వత సీటును కేటాయిస్తూ నిర్వాహకులు ఆయనను ఘనంగా సత్కరించారు. ప్రపంచ సినీ రంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రముఖ ఫ్రెంచ్ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత కోస్టా సమక్షంలో రాజమౌళి ఈ గౌరవాన్ని అందుకున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన రాజమౌళి.. ఇలాంటి అరుదైన గౌరవం దక్కడం ఎంతో ఆనందంగా ఉంది. నేను ఊహించని గుర్తింపును అందించిన నిర్వాహకులకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం రాజమౌళికి లభించిన ఈ అంతర్జాతీయ గౌరవంపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేస్తున్నారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular