HomeMovie News Teluguసప్తగిరి కామెంట్స్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..

సప్తగిరి కామెంట్స్‌పై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్..

టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ప్రభాస్ అభిమానులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సప్తగిరి.. హీరోగా కూడా పలు సినిమాలు చేసి ఇప్పుడు మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం ‘పురుష’ మే 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడిన సప్తగిరి.. ‘పరిశ్రమలోకి వచ్చి 18 ఏళ్లు అయ్యింది. ఇప్పుడు డబ్బు కోసం కాకుండా నటుడిగా సంతృప్తినిచ్చే పాత్రలు చేయాలని అనుకుంటున్నాను. ఇటీవల సరస్వతి, ది రాజాసాబ్, కొక్కరోకో వంటి సినిమాలు చేశాను. అయితే ఇవన్నీ చిన్న స్థాయి సినిమాలు కావడంతో ప్రేక్షకులకు అంతగా రీచ్ కావడం లేదు’ అని వ్యాఖ్యానించారు.

సప్తగిరి చేసిన ఈ వ్యాఖ్యల్లో ముఖ్యంగా ‘ది రాజాసాబ్’ సినిమాను చిన్న సినిమా అని పేర్కొనడం ఇప్పుడు వివాదానికి కారణమైంది.

దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను చిన్న సినిమా అనడంపై అభిమానులు మండిపడుతున్నారు.

గతంలో ఇదే సినిమా ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ‘ఈ చిత్రం రూ.1000 కోట్లు కాదు, రూ.2000 కోట్లు వసూలు చేస్తుంది’ అని చెప్పిన సప్తగిరి.. ఇప్పుడు మాత్రం చిన్న సినిమా అని మాట్లాడటం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో సప్తగిరిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. కేవలం పబ్లిసిటీ కోసం ఇలా మాట్లాడుతున్నారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ వివాదంపై సప్తగిరి ఎలా స్పందిస్తారో చూడాలి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular