HomeMovie News Teluguత్రిషకు రూ.12 కోట్ల బంపర్ ఆఫర్?

త్రిషకు రూ.12 కోట్ల బంపర్ ఆఫర్?

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎవర్‌గ్రీన్ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న త్రిష ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. ఒకవైపు భారీ సినిమాలు, మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలతో త్రిష పేరు నిత్యం ట్రెండింగ్‌లో కనిపిస్తోంది.

ప్రస్తుతం తెలుగులో చిరంజీవి సరసన ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్న త్రిషకు ఇప్పుడు మరో భారీ ఆఫర్ వచ్చినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

తాజా సమాచారం ప్రకారం.. భారతీయ సినీ దిగ్గజాలు కమల్ హాసన్‌, రజినీకాంత్ కలిసి నటించనున్న భారీ మల్టీస్టారర్‌లో హీరోయిన్‌గా త్రిష ఎంపికైనట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించనున్నారని సమాచారం. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం త్రిషకు ఏకంగా రూ.12 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఒక హీరోయిన్‌కు ఈ స్థాయిలో పారితోషికం ఇవ్వడం దక్షిణాదిలో అరుదైన విషయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.

త్రిష గతంలో కమల్ హాసన్‌తో మన్మధన్ అంబు, తూంగావనం, థగ్ లైఫ్ వంటి సినిమాల్లో నటించింది. ఇప్పుడు మళ్లీ కమల్, రజినీకాంత్ వంటి లెజెండ్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం ఆమె కెరీర్‌లో మరో పెద్ద మైలురాయిగా మారనుంది.

త్రిష ప్రస్తుతం వరుసగా భారీ అవకాశాలు అందుకుంటూ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో మరింత దూసుకుపోతోంది. మరో రెండు నెలల్లో ఈ మల్టీస్టారర్ సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

మొత్తానికి, త్రిషకు సంబంధించిన ఈ రెమ్యునరేషన్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular