HomeMovie News Teluguబాలయ్య - కొరటాల మూవీకి పవర్‌ఫుల్ టైటిల్..?

బాలయ్య – కొరటాల మూవీకి పవర్‌ఫుల్ టైటిల్..?

నటసింహం నందమూరి బాలకృష్ణ త్వరలో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రానికి ‘కార్పెంటర్’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. దాదాపు ఇదే టైటిల్‌ను ఫైనల్ చేసి త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ టైటిల్ బయటకు రావడంతో బాలయ్య అభిమానుల్లో హైప్ మరింత పెరిగింది. బాలయ్య మాస్ ఇమేజ్‌కు ఈ టైటిల్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఈ సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు. కొరటాల – అనిరుద్ కాంబోలో వస్తున్న మరో సినిమా కావడంతో మ్యూజిక్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి, కొరటాల శివ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుందని సమాచారం.

మొత్తానికి, బాలయ్య – కొరటాల కాంబో మూవీకి సంబంధించిన టైటిల్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular