HomeMovie News Teluguవిజయ్ విజయంపై నాని ట్వీట్ వైరల్..

విజయ్ విజయంపై నాని ట్వీట్ వైరల్..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ విజయంపై నేచురల్ స్టార్ నాని స్పందించారు. నటుడు విజయ్ కు అభినందనలు తెలుపుతూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్‌లో వైరల్ అవుతోంది.

నాని తన ట్వీట్‌లో.. ‘అభినందనలు విజయ్ సార్.. మొదట అనుమానించారు, కానీ ఇప్పుడు పట్టాభిషేకం చేశారు. ఇది మొదట మా ఇంట్లో జరిగింది.. ఇప్పుడు మా పొరుగు ఇంట్లో కూడా జరుగుతోంది. ఒక అండర్‌డాగ్ గెలవడం ఎప్పుడూ సినిమాలా అనిపిస్తుంది.. లేకపోతే పాలిటిక్స్ కూడా అలాగే ఉంటుందేమో!’ అంటూ తనదైన స్టైల్లో వ్యాఖ్యానించారు.

ఆయన ఎక్కడా నేరుగా ప్రస్తావించకపోయినా, ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ సాధించిన విజయాన్ని పరోక్షంగా సూచించినట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

తమిళనాడు ప్రజలు తమ నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేశారని, ఆ నమ్మకాన్ని విజయ్ నిలబెట్టుకుంటారని నాని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల తీర్పును గౌరవిస్తూ రాష్ట్రంలో మంచి మార్పులు రావాలని కోరుకున్నారు.

నాని ట్వీట్ తర్వాత సోషల్ మీడియాలో విభిన్న చర్చలు జరుగుతున్నాయి. గతంలో తక్కువ అంచనా వేసిన నాయకులు ప్రజల మద్దతుతో ఎలా ఎదిగారో ఇదే ఉదాహరణ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మొత్తానికి, ఇద్దరు స్టార్ హీరోల రాజకీయ ప్రయాణాన్ని ఒకే కోణంలో పోల్చిన నాని ట్వీట్ ప్రస్తుతం నెట్టింట భారీగా వైరల్ అవుతోంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular