HomeTeluguగాయపడ్డ సింహం మూవీ రివ్యూ & రేటింగ్

గాయపడ్డ సింహం మూవీ రివ్యూ & రేటింగ్

చిత్రం: గాయపడ్డ సింహం
దర్శకత్వం: కశ్యప్ శ్రీనివాస్
కథ – రచన: కశ్యప్ శ్రీనివాస్

నటీనటులు: తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి, శ్రీవిష్ణు, ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి, కశ్యప్ శ్రీనివాస్, హర్ష వర్ధన్, అనీష్ కురువిళ్ళ, శుభలేఖ సుధాకర్, ప్రదీప్ రావత్, కృష్ణ భగవాన్, తరుణ్ రోహిత్ తదితరులు

నిర్మాతలు: కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్

సంగీతం: స్వీకార్ అగస్తి
సినిమాటోగ్రఫీ: విద్యాసాగర్ చింత
ఎడిటర్: విప్లవ్ నైషధం

బ్యానర్: సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్

విడుదల తేదీ: 01 మే 2026

దర్శకుడు పవన్ సాదినేని సమర్పణలో కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘గాయపడ్డ సింహం’. కామెడీ, థ్రిల్లర్‌గా రూపొందిన గాయపడ్డ సింహం ఈ శుక్రవారం థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. నెలల గ్యాప్ లోనే తరుణ్ భాస్కర్ మళ్ళీ థియేటర్స్ లో సందడి చేసాడు. టాలీవుడ్ లో దర్శకుడిగా, నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. 2016 లో ‘పెళ్లి చూపులు’ సినిమాతో దర్శకుడిగా ప్రయాణం మొదలుపెట్టి జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకున్నాడు. నెక్స్ట్ 2018 లో ‘ఈ నగరానికి ఏమైంది’, 2023 లో కీడాకోలా సినిమాలకు దర్శకత్వం వహించి సూపర్ హిట్స్ కొట్టాడు. దర్శకుడిగా విజయం సాధించి హీరోగా మారాడు. మహానటి, సమ్మోహనం, ఫలక్ నామా దాస్, మీకు మాత్రమే చెప్తా, మిడిల్ క్లాస్ మెలోడీస్, సీతారామం, దాస్ కా దమ్కీ, సంతానప్రాప్తిరస్తు, ఓంశాంతి శాంతి శాంతి లాంటి సినిమాలతో సత్తా చాటిన తరుణ్ భాస్కర్ ఇప్పుడు గాయపడ్డ సింహం అంటూ రివెంజ్ డ్రామాతో వస్తున్నాడు. మరి ఈ మూవీ ఎలా ఉంది? తరుణ్ హీరోగా ఇంకో హిట్ కొట్టాడా? అన్నది ఈ రివ్యూలో చూద్దాం .

కథ:

దరహాస్ (తరుణ్ భాస్కర్) సాయి గాయత్రి (మానసా చౌదరి)ని ప్రేమిస్తాడు. కానీ గాయత్రి తండ్రి కాబోయే అల్లుడు అమెరికాలో సెటిలై ఉండాలని కండీషన్ పెడతాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటం కోసం దరహాస్ కష్టపడి అమెరికా వెళతాడు. కానీ ట్రంప్ ఇచ్చిన షాక్ వలన తిరిగి ఇండియాకి వచ్చేస్తాడు. ఇంత కష్టపడి అమెరికా వెళ్తే ట్రంప్ రూల్స్ కారణంగా ఇండియాకి తిరిగి రావాల్సి వచ్చింది అని ట్రంప్ పై దరహాస్ కోపం పెంచుకుంటాడు. అమెరికా అధ్యక్షుడిపై కోపంతో దరహాస్ ఏం చేశాడు? ఈ కథలో బ్రూటల్ ధర్మ (జేడీ చక్రవర్తి) పాత్ర ఏంటి? దరహాస్ కారణంగా ధర్మ ఎందుకు సిటీ వదిలి వెళ్లాల్సి వచ్చింది? శ్రీవిష్ణు పాత్ర ఏంటి? దరహాస్ కథ తెలిసీ ఐజీ విజయకాంత్ (శుభలేఖ సుధాకర్) తన కూతురు శాలిని (ఫరియా అబ్దుల్లా)ని ఇచ్చి ఎందుకు పెళ్లి చేయలనుకుంటాడు? చివరికి ట్రంప్ మీద దరహాస్ ప్రతీకారం తీర్చుకున్నాడా? లేదా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ:

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన తరవాత చాలా మంది యువకుల జీవితాలు తారు మారు అయ్యాయి. వారి కలలు, కథలు అర్దఅంతరంగా ముగిసి పోయాయి. సరిగ్గా ఇదే పాయింట్ ని కామెడీగా చెప్పుకొచ్చాడు దర్శకుడు. తన ప్రేమను గెలిపించుకోవడానికి కష్టపడి అమెరికా వెళ్లిన హీరో ట్రంప్ రూల్స్ కారణంగా ఇండియా వచ్చి పడిన కష్టాలు కామెడిగా తెరకెక్కించి ప్రేక్షకులని ఫుల్ గా ఎంటర్టైన్ చేసాడు దర్శకుడు. ఈ మూవీ మొదటినుంచి పాజిటీవ్ బజ్ తెచ్చుకుంది. తరుణ్ భాస్కర్, కశ్యప్ శ్రీనివాస్, విష్ణు మధ్య కామెడీ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. స్పూఫ్, పేరడీ లాంటివి ఒక్కొక్కసారి సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తాయి. ఈ సినిమాకి ఇదే ప్లస్ అయ్యింది. స్పూఫ్ ప్రధాన ఉద్దేశం టికెట్ తీసుకుని వచ్చిన ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే. గాయపడ్డ సింహం లో స్పూఫ్ సీన్ వచ్చినప్పుడు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ‘జల్సా’, ‘కేజీఎఫ్’, ‘అర్జున్ రెడ్డి’, ‘బొమ్మరిల్లు’ సినిమాలను స్పూఫ్ చేశాడు. ఇవి సినిమాకి పెద్దగా కలిసి రాకపోయినా ప్రేక్షకులు బోర్ ఫిల్ అవకుండా చేశాయని చెప్పొచ్చు. కథ కొత్తది. మంచి పాయింట్ అని చెప్పొచ్చు. ట్రంప్ మీద రివేంజ్ తీర్చుకోవటానికి చేతబడి చేయాలని హీరో చేసే ప్రయత్నాలు నవ్వు తెప్పిస్తాయి. ఇదే విషయాన్నీ ఇంకా కామెడీగా చెప్పొచ్చు, కథకి కూడా మంచి స్కోప్ ఉంది. కానీ దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ స్పూఫ్ మీద కాన్సంట్రేషన్ పెట్టి అసలు కథని పక్కన పెట్టేసారు. కథ స్క్రీన్ ప్లే మైనస్ అయినా మేకింగ్ స్టైలిష్ గా ఉంది. తెర నిండా మంచి హ్యూమర్ ఉన్న నటులే కానీ ఎవరినీ దర్శకుడు వాడుకోలేదు.

నటీ నటులు:

హైదరాబాదీ యువకుడిగా తరుణ్ భాస్కర్ నటన బాగుంది. న్యాచురల్ గా ఉంది. పెద్దగా పెర్ఫార్మన్స్ కి స్కోప్ లేకపోవటంతో ఉన్నంతవరకు తన పాత్రకి న్యాయం చేసాడు తరుణ్. హీరో ఫ్రెండ్స్ రోల్స్ లో విష్ణు ఓయ్, కశ్యప్ శ్రీనివాస్ కనిపించారు. మానసా చౌదరి, ఫరియా అబ్దుల్లా పాత్రలకి పెద్దగా స్కోప్ లేదు. స్క్రీన్ ప్రెజన్సీ కూడా తక్కువ ఉంది. సినిమా పూర్తి అయ్యాకా హీరోయిన్స్ ఎవరో కూడా గుర్తు ఉండదు. బ్రూటల్ ధర్మగా జేడీ చక్రవర్తి కొత్తగా ఉన్నాడు. పెద్ద డాన్ లా చూపించి కామెడీ చేసి పడేసారు. శ్రీ విష్ణు అక్కడక్కడా కనిపించి కొంత ఊరట నిచ్చాడు. శ్రీ విష్ణు కనిపించే సీన్స్ తక్కువే అయినా కథపై ఆకస్తిని పెంచాయి.

టెక్నికల్:

దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ గాయపడ్డ సింహాన్ని పొలిటికల్, సెటైరికల్ రివెంజ్ డ్రామాగా తెరకెక్కించారు. ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీని తీసుకుని సెటైరికల్ గా తెరకెక్కించాడు. సినిమాటోగ్రఫీ విజివల్స్ బాగున్నాయి . ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. సంగీతం పెద్దగా ఆకట్టుకొలేదు. పాటలు కథకి డిస్టబెన్స్ గా ఉన్నాయి. నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

తరుణ్ భాస్కర్
జేడీ చక్రవర్తి
శ్రీవిష్ణు
సెకండ్ హాఫ్

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్
పాటలు
లాజిక్స్ మిసింగ్

You May Like This
- Advertisment -spot_img

Most Popular