అక్కినేని అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘లెనిన్’ విడుదలపై నెలకొన్న అనుమానాలకు కింగ్ నాగార్జున చెక్ పెట్టారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా రిలీజ్ డేట్ మారుతుందనే వార్తలు వినిపించగా, తాజాగా నాగార్జున స్వయంగా క్లారిటీ ఇచ్చారు.
మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత అఖిల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
మొదట ఈ సినిమాను మే 1న విడుదల చేయాలని భావించిన మేకర్స్, తర్వాత జూన్ 26కు వాయిదా వేశారు. అయితే రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా కూడా అదే సమయానికి రాబోతుందనే వార్తలతో ‘లెనిన్’ మళ్లీ పోస్ట్‌పోన్ అవుతుందనే ప్రచారం జరిగింది.
ఈ పుకార్లకు చెక్ పెడుతూ నాగార్జున సోషల్ మీడియాలో స్పందించారు. నిన్న రాత్రి ‘లెనిన్’ ఫస్ట్ కట్ చూశాను. చాలా నమ్మకంగా చెప్పగలను.. అనుకున్నట్టుగానే జూన్ 26న ఈ సినిమా విడుదల అవుతుంది. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అని ఆయన స్పష్టం చేశారు.
పెద్ద సినిమాతో పోటీ ఉన్నప్పటికీ, కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినిమా అవుట్‌పుట్‌పై ఆయన చూపుతున్న ధీమా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఈ చిత్రం చిత్తూరు నేపథ్యంతో సాగే పీరియడ్ డ్రామా అని సమాచారం. స్థానిక యాస, భావోద్వేగాలతో కూడిన కథనం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతుందని టాక్.
అఖిల్ ఈ సినిమాలో ఇప్పటివరకు చేయని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు.
ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
మొత్తానికి ‘లెనిన్’ రిలీజ్‌పై ఉన్న అనుమానాలకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా రాణిస్తుందో చూడాలి.
watched the first cut of our film LENIN last night.
— Nagarjuna Akkineni (@iamnagarjuna) April 29, 2026
I say this with confidence and pride… you are about to witness a new AKHIL on June 26 2026.
mark the date!!!
see you in the theatres🔥





