HomeMovie News Teluguఆదర్శ కుటుంబం లో యంగ్ బ్యూటీకి బంపర్ ఛాన్స్..

ఆదర్శ కుటుంబం లో యంగ్ బ్యూటీకి బంపర్ ఛాన్స్..

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నారు. గత ఏడాది వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుని బ్లాక్‌బస్టర్ అందుకున్న వెంకీ మామ, ఇప్పుడు తన తదుపరి చిత్రం ‘ఆదర్శ కుటుంబం’ పై దృష్టి పెట్టారు.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటుండటం ఆసక్తిని పెంచుతోంది.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. మ్యూజిక్ విషయానికి వస్తే.. మొదట హర్షవర్ధన్ రామేశ్వర్ పేరు వినిపించినా, తాజాగా థమన్ ఈ ప్రాజెక్టులో చేరినట్లు టాక్ వినిపిస్తోంది.

ఇక తాజా అప్‌డేట్ ప్రకారం.. ‘హరిహర వీరమల్లు’తో గుర్తింపు పొందిన యంగ్ హీరోయిన్ పూజిత పొన్నాడ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

అంతేకాకుండా, ఆమె నారా రోహిత్ కు జోడీగా నటించనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇది పూజిత కెరీర్‌కు పెద్ద బ్రేక్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్‌కు త్రివిక్రమ్ డైలాగులు తోడైతే ఈ సినిమా థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయం. ఒకవైపు వెంకీ-శ్రీనిధి జోడీ, మరోవైపు నారా రోహిత్-పూజిత జంటతో సినిమా మరింత ఆసక్తికరంగా మారనుంది.

మొత్తానికి ‘ఆదర్శ కుటుంబం’ పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని స్పష్టమవుతోంది. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular