HomeMovie News Teluguరాఘవ్ చద్దా వివాదంలో ప్రియాంక చోప్రా పేరు..

రాఘవ్ చద్దా వివాదంలో ప్రియాంక చోప్రా పేరు..

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నేత రాఘవ్ చద్దా పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామంపై తాజాగా మరో కొత్త ట్విస్ట్ బయటకు వచ్చింది.

పంజాబ్ మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య, మాజీ ఎమ్మెల్యే నవజ్యోత్ కౌర్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. రాఘవ్ చద్దా నిర్ణయం వెనుక గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ప్రభావం ఉందని ఆమె ఆరోపించారు.

నవజ్యోత్ కౌర్ సిద్ధూ మాట్లాడుతూ.. రాఘవ్ చద్దా ఆప్ నుంచి బయటకు రావడంలో ఆయన భార్య పరిణీతి చోప్రా సోదరి ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

ఇటీవల ప్రియాంక చోప్రా ప్రధాని నరేంద్ర మోదీని కలిసినప్పుడు రాఘవ్ చద్దా విషయాన్ని ప్రస్తావించి, ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కోరినట్లు ఆమె ఆరోపించారు.

రాఘవ్ చద్దా రాజీనామా చేసినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించకపోవడం వెనుక కూడా ప్రియాంక చోప్రా ప్రభావమే ఉందని నవజ్యోత్ కౌర్ పేర్కొన్నారు.

కేజ్రీవాల్‌కు రాఘవ్ విషయంలో హద్దులు దాటవద్దని సూచనలు వెళ్లినట్లు కూడా ఆమె వ్యాఖ్యానించారు.

గత 14 ఏళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతగా ఉన్న రాఘవ్ చద్దా, ఏప్రిల్ 24న అధికారికంగా రాజీనామా చేశారు. అనంతరం తన రాజకీయ భవిష్యత్తు బీజేపీతోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు.

రాజ్యసభ బాధ్యతల నుంచి తప్పించబడిన కొన్ని రోజులకే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

రాఘవ్ చద్దా బీజేపీలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ ముంబైలో కొంతమంది నిరసనలు చేపట్టారు. పార్టీ మార్పులపై విమర్శలు వస్తున్న సమయంలో, నవజ్యోత్ కౌర్ సిద్ధూ చేసిన ప్రియాంక చోప్రా వ్యాఖ్యలు ఈ వివాదానికి కొత్త కోణాన్ని తెచ్చాయి.

మొత్తానికి, ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలకు దారి తీసింది.

You May Like This
- Advertisment -spot_img

Most Popular