HomeMovie News Teluguకష్టపడి సంపాదించిన పేరు పోతుంది.. మంగ్లీ ఆవేదన

కష్టపడి సంపాదించిన పేరు పోతుంది.. మంగ్లీ ఆవేదన

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మైక్రో ఫైనాన్స్ ఆరోపణలపై ప్రముఖ గాయని మంగ్లీ తీవ్రంగా స్పందించారు. ఈ వివాదంపై క్లారిటీ ఇస్తూ ఆమె ఒక వీడియో విడుదల చేసి, తనపై వస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండించారు.

మంగ్లీ మాట్లాడుతూ.. మైక్రో ఫైనాన్స్ అనే విషయం నాకు ముందెప్పుడూ తెలియదు. అలాంటిది నేను ఇంత పెద్ద స్కామ్‌లో ఉన్నానని ఆరోపించడం నన్ను, నా కుటుంబాన్ని షాక్‌కు గురి చేసింది. నా పని పాటలు పాడటం, ప్రోగ్రామ్‌లు చేయడం మాత్రమే. నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు అని తెలిపారు.

ఈ కేసులో డబ్బులు కోల్పోయిన వారు ఆర్థికంగా నష్టపోతే, నేను జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న పేరును కోల్పోతున్నాను. నా ప్రతిష్టను దెబ్బతీయడానికి కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నిస్తున్నారు అంటూ మంగ్లీ ఆవేదన వ్యక్తం చేశారు.

తాను ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయబోనని ఆమె స్పష్టం చేశారు. తన పేరు వాడుకుని ఎవరైనా మోసాలకు పాల్పడితే దానికి తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయవద్దని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అభిమానులకు విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం మంగ్లీ విడుదల చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి నిజాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

You May Like This
- Advertisment -spot_img

Most Popular