HomePolitics Teluguవిజయ్ ఆస్తులు రూ.520 కోట్లు!

విజయ్ ఆస్తులు రూ.520 కోట్లు!

తమిళనాడులో ఎన్నికల సందర్బంగా తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత, ప్రముఖ నటుడు తలపతి విజయ్ తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడించారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆయన సమర్పించిన తొలి ఎన్నికల అఫిడవిట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ అఫిడవిట్ ప్రకారం విజయ్ మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.520 కోట్లుగా ఉంది. ఇందులో చరాస్తులు, స్థిరాస్తులను వేర్వేరుగా వివరించారు. సుమారు రూ.405 కోట్ల చరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందులో నగదు, బ్యాంక్ డిపాజిట్లు, విలువైన వాహనాలు, ఇతర పెట్టుబడులు ఉన్నాయి.

అలాగే రూ.115 కోట్ల స్థిరాస్తులు – ఇళ్లు, భూములు, భవనాల రూపంలో ఉన్నట్లు వెల్లడించారు.

భార్య పేరిట భారీ డిపాజిట్లు

విజయ్ తన భార్య సంగీత పేరిట ఉన్న బ్యాంక్ డిపాజిట్ల వివరాలను కూడా స్పష్టంగా వెల్లడించారు. ఇండియన్ బ్యాంక్‌లో రూ.25 కోట్లు, యాక్సిస్ బ్యాంక్‌లో రూ.40 కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో రూ.20 కోట్లు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. మొత్తంగా సంగీత పేరిట బ్యాంక్ డిపాజిట్లు మాత్రమే సుమారు రూ.85 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

సినిమా రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో ఒకరైన విజయ్, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత తన ఆస్తులను బహిర్గతం చేయడం ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీసింది. ఈ అఫిడవిట్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular