HomeTeluguయూట్యూబర్ అన్వేష్‌కు లుకౌట్ నోటీసులు..

యూట్యూబర్ అన్వేష్‌కు లుకౌట్ నోటీసులు..

ఇటీవల వరుస వివాదాల్లో నిలుస్తున్న యూట్యూబర్ అన్వేష్‌కు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయనపై పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. నటి కరాటే కల్యాణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో కరాటే కల్యాణి గతంలో అన్వేష్‌పై ఫిర్యాదు చేయగా, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే తాజాగా లుకౌట్ నోటీసులు జారీ కావడం చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల అన్వేష్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అయిన విషయం కూడా వార్తల్లో నిలిచింది. అనంతరం తనకు రెండు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, రెండు యూట్యూబ్ ఛానెల్స్ ఉన్నాయని చెబుతూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఉపయోగించిన పదజాలంపై కూడా విమర్శలు రావడంతో, ఈ అంశంపై ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ సంస్థలకు పోలీసులు లేఖ రాయనున్నట్లు సమాచారం.

ఈ పరిణామాల నేపథ్యంలో అన్వేష్ అరెస్ట్ అవుతారా అనే చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతోంది. ఇదే సమయంలో లుకౌట్ నోటీసులపై స్పందించిన కరాటే కల్యాణి, అవసరమైతే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని కేంద్రాన్ని కోరుతామని తెలిపారు. దేవీ దేవతలను అవమానించడం మాత్రమే కాకుండా దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించారు.

పోలీసులు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని చర్యలు చేపట్టారని, చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన పరిణామాలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీస్తున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular