HomeMovie News Teluguబ్యూటిఫుల్‌ 'ఫాల్కన్‌' బన్నీ నువ్వు సూపరెహే..!

బ్యూటిఫుల్‌ ‘ఫాల్కన్‌’ బన్నీ నువ్వు సూపరెహే..!

స్టైలిష్‌ స్టార్‌ అని ముద్దుగా ఫ్యాన్స్‌ చేత పిలిపించుకునే బన్నీ తాజాగా ఓ స్టైలిష్‌ వ్యాన్‌ డిజైన్‌ చేయించుకున్నాడు. దానికి ఆయన ముద్దుగా ‘ఫాల్కన్‌‘ అని పేరు పెట్టుకున్నారు. నిజ్జంగా నిజం.. ఈ ఫాల్కన్‌లోని ఇంటీరియర్‌ ఉంది చూశారూ.. భూలోకపు స్వర్గాన్ని తలపిస్తోంది. ఆ వ్యాన్‌లోని సకల సౌకర్యాలను అలా తనకు నచ్చినట్లు డిజైన్‌ చేయించుకునేందుకు అయిన ఖర్చు అక్షరాలా 6 కోట్లు.

ఇదంతా అభిమానుల వల్లే జరిగిందంటున్నాడు బన్నీ. తాను ఏ కొత్త వస్తువు కొనుక్కున్నా, దాని వెనక అభిమానులు అపూర్వమైన ఆశీర్వాదం, ప్రేమ వల్లనే అది సాధ్యమైందని ఫ్యాన్స్‌కి బిస్కెట్‌లాంటివేవో వేసేశాడనుకోండి అది వేరే విషయం. అయితే ఆ వ్యాన్‌కి సంబంధించిన ఇంటీరియర్‌ ఫోటోల్ని బన్నీ సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ‘ఇదే నా ఫాల్కన్‌’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ ఫోటోలు చూసి, బన్నీ వ్యానిటీ కారు భలేగుందంటూ ఫ్యాన్స్‌ రిప్లై ఇస్తున్నారు. ఎంతైనా రాసి పెట్టుండాలి ఇలాంటి వ్యాన్‌కి ఓనర్‌ కావాలంటే కదా.. ఇలాక్కూడా అనుకుంటున్నారు.

ఇకపోతే, బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. హారికా హాసినీ క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో పాటు బన్నీ మరో రెండు సినిమాల్ని లైన్‌లో ఉంచిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి సుకుమార్‌ది కాగా, ఇంకోటి వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ‘ఐకాన్‌’ చిత్రం. ఇవి కూడా త్వరలోనే స్టార్ట్‌ కానున్నాయి.

You May Like This
- Advertisment -spot_img

Most Popular