HomeMovie News Telugu'ఇదీ భాయ్‌ అంటే..' సల్మాన్‌ గురించి ఉపాసన!

‘ఇదీ భాయ్‌ అంటే..’ సల్మాన్‌ గురించి ఉపాసన!

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ ఫిట్‌నెస్‌ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆ ఫిట్‌నెస్‌ వెనక బోలెడన్ని రహస్యాలున్నాయట. ఆ రహస్యాల్ని మెగా కోడలు ఉపాసన తెలుసుకుందట. మరి ఏంటా.? రహస్యాలు.? అంటే త్వరలోనే చెబుతానంటోంది ఉపాసన. తాజాగా ‘భారత్‌’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సల్మాన్‌ ఖాన్‌. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ దిశగా పరుగులు పెడుతోంది. ఇదిలా ఉంటే, మెగా కోడలు ఉపాసన, సల్మాన్‌ ఖాన్‌ని ఇంటర్వ్యూ చేసింది. మెగా కోడలు అనే హోదా ఉన్నా, ఉపాసనకు సెపరేట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంది. బిజినెస్‌ ఉమెన్‌గా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది.

అపోలో గ్రూపుకి సంబంధించి ‘బి పాజిటివ్‌‘ అనే మ్యాగజైన్‌కి ఎడిటర్‌గా పని చేస్తోంది. ఈ మ్యాగజైన్‌ కోసం అప్పుడప్పుడూ స్టార్‌ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ, వారి డైట్‌, ఫిట్‌నెస్‌ రహస్యాల్ని తెలుసుకుని వ్యూయర్స్‌కి అందుబాటులో ఉంచుతుంది. అందులో భాగంగా తాజాగా సల్లూ భాయ్‌ని ఇంటర్వ్యూ చేసింది. మెగా ఫ్యామిలీతో సల్లూ భాయ్‌కి మంచి స్నేహం ఉంది.

చరణ్‌కి, సల్మాన్‌ మంచి ఫ్రెండ్‌. ఫిట్‌నెస్‌కి సంబంధించి అప్పుడప్పుడూ సల్మాన్‌ఖాన్‌ నుండి కొన్ని సూచనలు, సలహాలూ తీసుకుంటుంటాడు చరణ్‌. చరణ్‌ కోసం స్పెషల్‌గా సల్మాన్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ని కూడా నియమించిన సందర్భాలున్నాయి గతంలో. అంతటి అనుబంధం ఉంది కాబట్టే, ప్రస్తుతం ఎంతో బిజీ షెడ్యూల్‌లో ఉన్నా, మెగాకోడలు ఉపాసనకు ఇంటర్వ్యూ ఇచ్చాడు సల్లూ భాయ్‌. అయితే, సల్మాన్‌ ఖాన్‌ చెప్పిన ఫిట్‌నెస్‌ రహస్యాలేంటో ఇంకా రివీల్‌ చేయలేదు. కానీ, సల్మాన్‌ఖాన్‌లోని న్యూ యాంగిల్‌ని త్వరలో చూపించబోతున్నాం.. అని ట్విట్టర్‌లో పేర్కొంది ఉపాసన.

You May Like This
- Advertisment -spot_img

Most Popular